ఆంధ్రా స్పెషల్ 'గోంగూర చికెన్'.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చికెన్ ను రకరకాలుగా చేసుకుంటారు. ఫ్రై చేసుకుంటారు. కొంతమంది పులుసు, గ్రేవీ పెట్టుకుంటారు. అలాగే మరికొన్ని రకాలుగా చికెన్ ను తింటారు. అయితే గోంగూర చికెన్ కూడా ఈ లిస్టులో ఉంది. గోంగూర చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ గోంగూర చికెన్ ఈజీగా చేసుకోవచ్చు. మరి గోంగూర చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి..?
గోంగూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఓసారి చూస్తే.. ఉప్ప , పసుపు, కారం వేసి ఉడికించుకున్న చికెన్ ను పక్కన పెట్టుకోవాలి. గోంగూర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు, ధనియాలు, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొత్తిమీర తరుగు.. అన్నీ సిద్ధం చేసుకోవాలి.
గోంగూర చికెన్ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో తగినంత నూనే పోసుకోవాలి. నూనె వేడెక్కగానే అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి ఉడికించిన చికెన్ ను తీసుకోవాలి.

ఆ చికెన్ ను అందులో వేయాలి. చికెన్ కు సరిపడా కారం వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికించాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అందులో వేయాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర తురుము వేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది.












Click it and Unblock the Notifications