ఇది రెండు చెంచాలు తాగితే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ లు దండగ.. ట్రై చెయ్యండి!
ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఒబేసిటీ. విపరీతంగా బరువు పెరిగి ఆ బరువు తగ్గడానికి నానా చావు చస్తున్నారు. బరువు తగ్గడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ల కోసం డాక్టర్ల వద్దకు, బ్యూటీ పార్లర్లకు పరుగులు పెడుతున్నారు.
ఇది తాగితే బరువుకు చెక్
అయితే కచ్చితంగా వెయిట్ లాస్ కావాలి అనుకునేవారు శరీరంలోని కొవ్వు కరగాలంటే, బరువు తగ్గాలంటే ప్రతి రోజు ఒక చిన్న డ్రింక్ ను భోజనానికి ముందు తాగితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెబుతున్నారు. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బర్న్ అయి, మన వెయిట్ తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ ఆఫ్ వెనిగర్ తో బరువు ఈజీగా తగ్గుతామని చెబుతున్నారు.

జీవన శైలి మార్పులతో పాటు ఇది నీళ్ళలో కలుపుకు తాగండి
మూడు నెలపాటు రోజు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్న వ్యక్తులు బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఇది మనం తినే ఆహారాన్ని తక్కువ చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలి మార్పులు చేసుకోవడంతో పాటుగా భోజనానికి ముందు నీళ్లతో కానీ, సలాడ్లతో కానీ కలుపుకుని ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ దండగ... ఇది ఉండగా
వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ ల కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగిస్తూ క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకొని, తీసుకునే ఆహారం విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు.
గ్లాసు వేడినీళ్ళలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ చాలు
ఇక ఆపిల్ సైడర్ వెనిగర్ ను, భోజనానికి ముందు ఒక గ్లాసు వేడినీళ్లలో రెండు స్పూన్లు వేసుకుని తాగినా, మనం తాగే టీ లో కలుపుకొని తాగినా, తినే సలాడ్ లపైన వేసుకుని తీసుకున్న మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ తో బరువు తగ్గడం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, తలలో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని , చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్ విషయంలో జాగ్రత్త
అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి అని, ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావం దంతాలపైన ఉన్న ఎనామిల్ పైన పడకుండా నోటిని నీళ్లతో కడుక్కుంటే మంచిదని చెబుతున్నారు. అయితే ఇది అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications