Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బరువు తగ్గి స్లిమ్ గా కనిపించాలా? సూపర్ డ్రింక్.. వందశాతం రిజల్ట్!

ఊబకాయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని పీడిస్తున్న సమస్య. ఊబకాయం ఒకటి చాలు మనకు గంపగుత్తగా అనారోగ్య సమస్యలను తీసుకురావడానికి.. ఊబకాయంతో ఎవరైతే బాధపడతారో వారికి మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

బరువు తగ్గాలంటే ఈ ద్రావణం తీసుకోండి
అయితే బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు ప్రతి రోజు ఉదయం వేడి నీళ్లలో ఒక పదార్థాన్ని కలుపుకొని తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. మన బరువును తగ్గించి మనల్ని స్లిమ్ చేసే ఆ అద్భుతమైన ద్రావణం ఏమిటి? దానిని ఏ విధంగా తీసుకుంటే మనం బరువు తగ్గుతాము? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

apple sider venigar reduces weight you will be slim when you drink with empty stomach

బరువు తగ్గటానికి సహజ మార్గాలే బెస్ట్
బరువు తగ్గడానికి ప్రయత్నం చేసే సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సహజ మార్గాల ద్వారా బరువు తగ్గడం, కొద్ది కొద్దిగా బరువు తగ్గడమే మంచిది అని చాలామంది నిపుణులు చెబుతారు. బరువు తగ్గడానికి మొదట తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు. అంతే కాదు కొన్ని శక్తివంతమైన పానీయాలు తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్ తో అధిక బరువుకు చెక్
ఇక అటువంటి పానీయాల విషయానికి వస్తే వాటిల్లో ముఖ్యంగా చెప్పదగింది యాపిల్ సైడర్ వెనిగర్. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ప్రతిరోజు మనం ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మనం త్వరగా బరువు తగ్గాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని సుమారు 20 మిల్లీలీటర్ల యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా చేస్తే డేంజర్ ... జాగ్రత్త
ఇది మాత్రమే కాకుండా భోజనానికి 15 నిమిషాలు ముందు కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటే ఇది మన ఆహారం జీర్ణం కావడానికి దోహదం చేస్తుంది. అయితే బరువు తగ్గుతామని ఆపిల్ సైడర్ వెనిగర్ ను తరచూ తీసుకుంటే మాత్రం అనవసరమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పరిమిత మోతాదులో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల ఇది మన ఆకలిని తగ్గిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ తో ప్రయోజనాలు ఇలా
అనవసరమైన అనారోగ్యకరమైన ఆహారాన్ని నిరోధిస్తుంది. ఇది మన శరీరంలో అదనపు కేలరీలు తీసుకోకుండా కాపాడుతుంది. మన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ మన శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలోనూ సహాయం చేస్తుంది. కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిమిత మోతాదులో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+