ఈ నూనెలు కలిపి రాయండి... జుట్టు తాటిచెట్టులా పెరుగుతుంది!

మారుతున్న జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు కలిసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే మనిషి తన పంచప్రాణాలుగా భావించే జుట్టు కూడా ప్రస్తుత జీవనశైలివల్ల రాలిపోతోంది. కొంతమందికి తక్కువ వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. జన్యుపరంగా కొందరికి అయితే, మరికొందరికి వారి నిర్లక్ష్యంవల్లే ఊడిపోతుంటుంది. మనిషి డబ్బులు పోగొట్టుకున్నా బాధపడడుకానీ ఒక్క వెంట్రుక ఊడిపోయినా కోట్ల రూపాయలు కోల్పోయినంత బాధకు గురవుతాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు పల్చబడుతూనే ఉంటుంది. అలా కాకుండా జట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఈ మూడు కలిపి రాయాలి
కొబ్బరినూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్ ఆముదం కలపాలి. ఇలా కలిపిరాస్తే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. దీనితర్వాత మరో పద్దతి ఉంది. ఉల్లిపాయ నూనెతో కూడా జుట్టు పెరుగుతుంది. ఇది మెరుగైన ఫలితాలను అందిస్తోంది. 200 గ్రాముల కొబ్బరి నూనె లేదంటే ఆవాల నూనె తీసుకోవాలి. పాన్ లో వీటిని వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కప్పు కరివేపాకు కలపాలి. వీటన్నింటినీ కలిపి జుట్టుకు రాసుకోవడంవల్ల పోషణ బాగా అందుతుంది. రెట్టింపు వేగంతో జుట్టు పెరగడంతోపాటు ఎంతో మృదువుగా తయారవుతుంది.

Applying these oils together makes the hair thicker

ప్రొటీన్ తో జుట్టు తయారవుతుంది
జుట్టు ప్రధానంగా ప్రోటీన్ తో తయారవుతుంది. చికెన్, చేప, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే విటమిన్లు A, C, E, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, ఇనుము వంటివి జుట్టు ఆరోగ్యం కోసం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాల్లో లభిస్తాయి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు మంచి తేమను అందిస్తాయి. అలాగే తగినంత నీరు తాగడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తగినంత నిద్ర తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక కారణం కావచ్చు. కాబట్టి మనోవేదనను తగ్గించుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+