తల స్నానానికి ముందు జుట్టుకు నూనె రాస్తున్నారా? ఇది మంచిదేనా?

తల స్నానానికి ముందు జుట్టుకు నూనె రాసే ఆచారం మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక సహజమైన జుట్టు సంరక్షణ పద్ధతి. ఇది కేవలం ఆయుర్వేదం మాత్రమే కాకుండా అనేక సంస్కృతులలో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. తలకు నూనె రాసుకోవడం ఒక రకమైన మసాజ్ లాంటిది. ఇది మనోనిబ్బరాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.తెల్లటి జుట్టు, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలను నివారిస్తుంది.

జుట్టుకు నూనె రాస్తే ప్రయోజనాలు:
తల స్నానానికి గంట ముందు నూనెను తలకు రాసి మర్ధన చేయడం వల్ల తల చర్మం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల వరకు పోషణ అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.నూనెలు కుదుళ్లను తేమగా ఉంచి, జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. జుట్టు చర్మానికి తేమ అందుతుంది, ఇది పొడిగా ఉన్న జుట్టు సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ పద్ధతి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని రకాల నూనెలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. ఇవి తల చర్మాన్ని తేమగా ఉంచి, చుండ్రు ఏర్పడకుండా నిరోధిస్తాయి. తరచూ తలకు ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టును మృదువుగా, మెరిసిపోయేలా చేస్తాయి. ఇవి జుట్టును పగిలిపోకుండా, చిట్లబడకుండా కాపాడతాయి. కొన్ని నూనెలు తల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. తలకు నూనె రాసుకోవడం ఒక రకమైన మసాజ్ లాంటిది. ఇది మనోనిబ్బరం మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.

Are you applying oil to your hair before taking a shower Is this good

ఏ నూనెలు ఉపయోగించాలి?
కొబ్బరి నూనె అన్ని రకాల జుట్టుకు అనుకూలంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా చేసి, పోషిస్తుంది. కొంతమంది జుట్టుకు ఆలివ్ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తారు. ఇది జుట్టును మరమ్మతు చేసి, బలపరుస్తుంది. ఆముదాన్ని మన పూర్వికుల నుంచి జుట్టు ఆరోగ్యానికి ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు రాలడాన్ని నిరోధించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా నల్ల నువ్వుల నూనె జుట్టును మెరిసిపోయేలా చేసి, తెల్లటి జుట్టు రాకుండా నిరోధిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?
తల స్నానానికి కనీసం ఒక గంట ముందు జుట్టుకు నూనె రాసుకోవాలి. నూనెను తలకు, జుట్టుకు మసాజ్ చేయాలి. ఒక రాత్రి పూట నూనె వదిలేయడం మంచిది. మరుసటి రోజు తల స్నానం చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అధికంగా నూనె రాసుకోవడం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. మీ జుట్టు రకానికి తగిన నూనెను ఎంచుకోవాలి. నూనెను కాస్త వేడి చేసి రాసుకోవడం మంచిది.తేలికపాటిగా మర్ధన చేయడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.నూనెను కనీసం 30 నిమిషాలు తలకు ఉంచి, తర్వాత తగిన తలస్నానం చేయవచ్చు

తల స్నానానికి ముందు జుట్టుకు నూనె రాసే పద్ధతి చాలా సులభమైన, సహజమైన జుట్టు సంరక్షణ పద్ధతి. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించదు. కాబట్టి, మీరు కూడా ఈ పద్ధతిని అనుసరించి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+