పారాసిటమాల్ ఎక్కువ వేసుకుంటున్నారా? జాగ్రత్త!

పారాసిటమాల్ ని చాలామంది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. కొద్దిపాటి జ్వరం వచ్చిన, ఒళ్ళు నొప్పులుగా అనిపించినా దేనికైనా సరే పారాసిటమాల్ పడాల్సిందే. వైద్యుల సిఫార్సు అక్కర లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పారాసిటమాల్ ను కొనుగోలు చేసే వినియోగిస్తూ ఉంటారు. అయితే పారాసెటమాల్ ను కొద్దిపాటి నొప్పిని, జ్వరాన్ని తగ్గించడానికి వినియోగించవచ్చు కానీ ఇతర అనారోగ్య సమస్యలకు వినియోగించకూడదు.

పారాసిటమాల్ తో ఆరోగ్య ప్రమాదాలు
అలాగే దీర్ఘకాలం జ్వరం, నొప్పులు ఉంటే వైద్యులను సంప్రదించాలి కానీ ఎక్కువ రోజులు పాటు దీనిని ఉపయోగించ కూడదు. పారాసిటమాల్ ఎక్కువగా వినియోగించేవారు ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి అది వారి ప్రాణాలు మీదకే తెస్తుంది. పారాసిటమాల్ ను వెన్నునొప్పి, తలనొప్పి, మైగ్రేన్, కండరాల నొప్పులు, పీరియడ్ నొప్పి, జలుబు, ఫ్లూ వంటి వాటికి ఉపయోగించవచ్చు.

Are you taking too much paracetamol Be careful

Take a Poll

ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ తీసుకుంటే జరిగేదిదే
పారాసిటామాల్ తీసుకునేటప్పుడు వైద్యులు సిఫార్సు చేసిన మోతాదును ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అలాకాకుండా ఏమీ కాదని భావించి ఎక్కువ మోతాదులో పారాసిటమాల్ ను తీసుకుంటే దీని ప్రభావం లివర్ పైన పడుతుంది. ఇక ఇదే విషయాన్ని ప్రముఖ లివర్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ప్రముఖ ఆసుపత్రి స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లివర్ టాక్స్ జాతీయ సదస్సు జరిగింది.

లివర్ వైద్య నిపుణుల సదస్సులో కీలక హెచ్చరిక
ఈ సదస్సులో వైద్య నిపుణులు పారాసిటమాల్ అధిక వినియోగం కారణంగా కలిగే ఆరోగ్య నష్టాలను గురించి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కాలేయ ఆరోగ్యం పైన అవగాహన కలిగి ఉండాలని, కాలేయ ఆరోగ్యం కోసం లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, ఫైబ్రో స్కాన్, లివర్ బయాప్సీ వంటి పరీక్షలు ఉంటాయని తెలిపారు. పారాసిటమాల్ అధిక వినియోగం కారణంగా తీవ్రమైన లివర్ డామేజ్ జరుగుతుందని హెచ్చరించారు.

ప్రాణాలకే ముప్పుగా మారుతున్న ఓవర్ యూసేజ్
కొన్నిసార్లు అది ప్రాణాలకే ముప్పుగా మారుతుందని, అటువంటి అనేక కేసులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయని వారు చెప్పారు. కనుక పారాసిటమాల్ అధిక వినియోగం మంచిది కాదని వైద్యులు చెప్పిన విషయాలను గుర్తించి దానిని తగిన మోతాదులో తీసుకోవాలి, లేదంటే అనవసరపు రిస్క్ తీసుకోవలసి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+