మద్యం తాగుతున్నారా? అయితే ఈ తీవ్రమైన నష్టాలను తెలుసుకోండి.. ఆపై నిర్ణయించుకోండి!!

చాలామంది మద్యం తాగడాన్ని ఒక సరదాగా ప్రారంభించి, దానిని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. అయితే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల అనేక తీవ్రమైన నష్టాలు మన ఆరోగ్య విషయంలో వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మద్యం సేవించటం వ్యసనం అయితే ప్రాణాలకే ప్రమాదం
చాలామంది సంతోషకర సమయమైనా, విచారకర సమయమైనా మద్యం సేవించడానికి ఇష్టపడతారు. మొదట సరదా.. తర్వాత అలవాటుగా.. ఆపై వ్యసనంగా మారుతుంది. అలా మద్యం సేవించడం వ్యసనంగా మారితే అది ప్రాణాల మీదకు తెస్తుంది. అతిగా మద్యం సేవించే అలవాటు ఉంటే త్వరితగతిన దానిని మానుకోవలసిన అవసరం ఉంది.

Are you drinking alcohol But know these serious risks then decide

మద్యపానం కారణంగా లివర్, ప్యాంక్రియాస్ కు ప్రమాదం
తరచూ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. కాలేయం వాపు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ మరియు ఇతర రసాయనాలు ఉత్పత్తి అయ్యే శరీరంలోని అవయవం. మద్యపానం వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది.

క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం
మద్యం ఎక్కువ సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. మద్యాన్ని తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మధుమేహం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన వివరాల ప్రకారం ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ సేవించే వారిలో రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మద్యపానం కారణంగా ఎముకల బలహీనత .. సెక్స్ సామర్ధ్యం తగ్గుదల
అధికంగా మద్యాన్ని తీసుకోవడం వల్ల ఎముకల బలహీనత వస్తుంది. క్యాల్షియం మరియు విటమిన్ డి శరీరంలో సరిగా పనిచేయకుండా పోతాయి. కీళ్లలో నొప్పి, కాళ్లలో నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి.అధికంగా మద్యం తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. వీర్యకణాల నాణ్యత పడిపోతుంది. ఫలితంగా సంతానలేమి సమస్య కలుగుతుంది.

మద్యపానంతో తీవ్ర నష్టాలు.. జాగ్రత్త
కాబట్టి ఇన్ని అనర్థాలకు కారణం అయ్యే మద్యాన్ని అధికంగా సేవించడం మానుకోవాలి. పూర్తిగా మానేసిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. తరచూ మద్యం సేవించే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుని, ఈ ప్రమాదాలను అర్థం చేసుకొని తదనుగుణంగా మద్యం సేవించడాన్ని కంట్రోల్ చేసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+