Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? ఒక్కసారి ఇవి తెలుసుకోండి మీకే మంచిది!

వేసవి వచ్చిందంటే చాలు, ఎండవేడిమి, ఉక్కపోతలతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరచడానికి, కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి అనేక రకాల పానీయాలను ఆశ్రయిస్తాం. వాటిలో అత్యంత సహజమైన, రుచికరమైన, సులభంగా లభించే పానీయం ఏదైనా ఉందా అంటే అది నిస్సందేహంగా చెరకు రసం. ఐస్ ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా అల్లం కలిపిన చల్లని చెరకు రసం గొంతులోకి వెళ్తే ఆ వేసవి తాపం ఇట్టే మాయమైపోతుంది. కేవలం రుచి కోసమే కాదు, చెరకు రసం తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.

వేసవిలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

తక్షణ శక్తి వనరు : చెరకు రసంలో సహజమైన చక్కెరలు (సుక్రోజ్) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరిన వెంటనే శక్తిగా మారతాయి. ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే నిమిషాల్లోనే పునరుత్తేజం పొందుతారు. వేసవిలో చెమట ద్వారా శరీరం నీటితో పాటు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. చెరకు రసంలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ద్రవాలను తిరిగి అందించి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి.

are-you-drinking-sugarcane-juice-in-summer-know-these-things-its-good-for-you

కాలేయానికి మంచిది : ఆయుర్వేదంలో చెరకు రసాన్ని కాలేయ సంబంధిత సమస్యలకు ఒక ఔషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పచ్చ కామెర్లు (Jaundice) వచ్చినప్పుడు శరీరం త్వరగా కోలుకోవడానికి చెరకు రసం చాలా ఉపయోగపడుతుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెరకు రసం సహజమైన మూత్రవిసర్జనకారి (diuretic). ఇది మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది .మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించడంలో దోహదపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది : చెరకు రసంలో ఉండే ఫైబర్ మరియు కొన్ని ఇతర పదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (ముఖ్యంగా B కాంప్లెక్స్), ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, అంటువ్యాధుల నుండి శరీరాన్ని కాపాడతాయి. దీని సహజమైన చల్లదనం వేసవి వేడిని తగ్గించి, శరీరాన్ని కూల్ చేస్తుంది. ఇది శరీరం యొక్క అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు కొన్ని గ్లైకోలిక్ యాసిడ్ మూలాలు చర్మ సమస్యలను తగ్గించి, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారడానికి సహాయపడతాయి.

ఎవరు చెరకు రసానికి దూరంగా ఉండాలి?
చెరకు రసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడం లేదా చాలా మితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉంటే మంచింది. చెరకు రసంలో సహజ చక్కెర (సుక్రోజ్) శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా, అనూహ్యంగా పెంచుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు చెరకు రసానికి పూర్తిగా దూరంగా ఉండటం అత్యంత ముఖ్యం.

బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని తక్కువ తీసుకోవడం మంచిది. చెరకు రసంలో కేలరీలు అధికంగా ఉంటాయి. మితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ, బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఎక్కువగా తాగితే వారి లక్ష్యం నెరవేరకపోవచ్చు. అంతే కాకుండా చాలామందికి చెరకు రసం జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ, కొందరిలో కొన్ని ప్రత్యేకమైన జీర్ణ సమస్యలున్నప్పుడు దీనిని తాగితే అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే ఇది అరుదు.

చెరకు రసం ఎప్పుడూ పరిశుభ్రమైన వాతావరణంలో తాజాగా తీసినదాన్నే తాగాలి. సరిగ్గా శుభ్రం చేయని యంత్రాల ద్వారా తీసిన రసం లేదా ఎక్కువసేపు నిల్వ ఉంచిన రసం తాగడం వల్ల కడుపునొప్పి, ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

వేసవిలో చెరకు రసం అనేది కేవలం దాహార్తిని తీర్చే పానీయమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాల గని. అయితే, పైన చెప్పిన ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు జాగ్రత్త వహించడం తప్పనిసరి. సరైన జాగ్రత్తలతో, మితంగా చెరకు రసం తాగడం వల్ల వేసవి వేడిని తట్టుకోవడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+