క్యాట్ ఫిష్ తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!
చాలామంది చేపలను ఇష్టంగా తింటారు. శాకాహారులను మినహాయించి మాంసాహారులు చేపలను మంచి ఆహారంగా భావిస్తారు. అయితే చేపలను తినడం మంచిదే అయినప్పటికీ అన్ని చేపలు తినడం మంచిది కాదు. కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. వాటిని తింటే మన ఆరోగ్యం కచ్చితంగా పాడవుతుంది. అసలు ఇంతకీ తినకూడని చేపలేంటి? ఎందుకు ఆ చేపలను తినకూడదు? మనం తెలుసుకుందాం.
క్యాట్ ఫిష్ తినేస్తున్న ప్రజలు
చాలామంది తెలిసి తెలియక క్యాట్ ఫిష్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. క్యాట్ ఫిష్ బాగా రుచిగా ఉంటుందని భావిస్తారు. అయితే క్యాట్ ఫిష్ తినడం చాలా డేంజర్ అని చెబుతున్నారు వైద్య నిపుణులు. క్యాట్ ఫిష్ కేవలం కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప. ఇది 6 నెలల్లోనే 20 కేజీల బరువుకు పెరిగే చేప. కొర్రమీను పోలి ఉండే ఈ చేపకు మీసాలు ఉంటాయి.

క్యాట్ ఫిష్ తో ఎంత డేంజర్ అంటే
క్యాట్ ఫిష్ మీసాలను తీసేసి మోసం చేస్తూ కొరమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తూ ఉంటారు. క్యాట్ ఫిష్ లో కొరమీను లానే ఒకే ముళ్ళు ఉంటుంది. ఈ చేపలను తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాట్ ఫిష్ లో ఉండే ఒమేగా సిక్స్ ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చే క్యాట్ ఫిష్
క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్ళు తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక క్యాట్ ఫిష్ తో కలిగే ఆనారోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ చేపలను అమ్మకూడదని, పెంచకూడదని నిషేధం విధించారు. క్యాట్ ఫిష్ సాగు చేస్తే వారిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకునే అధికారం మధ్య శాఖ అధికారులకు ఉంటుంది. అంతేకాదు వీరి పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేసి, కేసులు కూడా నమోదు చేయవచ్చు.
క్యాట్ ఫిష్ తింటే రోగాలు వద్దన్నా వస్తాయి.. జాగ్రత్త
అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ క్యాట్ ఫిష్ ను యదేచ్చగా సాగు చేస్తున్నారు. చాలామంది ఈ చేపలు తింటే అనారోగ్యం బారిన పడతామనే విషయం తెలియక ఇప్పటికీ తింటున్నారు. కుళ్లిపోయిన వ్యర్ధాలతో పెరిగే ఈ చేపలను తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని చేపలు తినాలి అనుకునేవారు ముఖ్యంగా ఈ చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications