ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యాన్ని దేవుడు కూడా కాపాడలేడు!

చెడు కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలామందికి అతి పెద్ద సమస్యగా మారింది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి .ముఖ్యంగా గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యతోనే వస్తుంది. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడితో కూడుకున్న జీవితం వెరసి లెక్కకు మిక్కిలి చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు.

ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారం
ప్రస్తుతం మనం చాలా హానికరమైన పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాం. ప్రతి దానికి మనం ప్లాస్టిక్ ను ఎక్కువగా వినియోగించడం మన ఆరోగ్యానికి, మన మనుగడకే ముప్పు తెస్తుంది. ప్లాస్టిక్ టీ కప్పులు, సంచులు, డబ్బాలు, టిఫిన్ బాక్సులు ఇలా ఒకటేమిటి, ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు బయట హోటల్స్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ప్లాస్టిక్ డబ్బాలలో వారు వేడివేడి ఆహారాన్ని పంపిస్తున్నారు.

Are you eating food in plastic boxes health risks Even God can t protect your health

ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టిన ఆహారంతో పేగులు డ్యామేజ్
స్కూల్స్, కళాశాలలకు వెళ్లే చిన్నారులకు కూడా ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని పెట్టి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టిన వేడివేడి ఆహారాన్ని తినడం ఎంత మాత్రం మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలలో ఉండే మైక్రో ప్లాస్టిక్ వేడివేడి ఆహారాన్ని అందులో వేసినప్పుడు ఆహారంలోకి చేరి మన ప్రేగులలోకి వెళుతుందని ఇది మన ప్రేగులలో సున్నితమైన పైపొరను డామేజ్ చేస్తుందని చెబుతున్నారు.

గుండె జబ్బుల రిస్క్
ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం కారణంగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని చాలా మంది పరిశోధకులు వెల్లడించారు. ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ తినడం కారణంగా రక్తప్రసరణ దెబ్బతింటుందని, ఫలితంగా గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరైతే గుండెజబ్బులతో బాధపడతారో వారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలని కూడా చెబుతున్నారు.

క్యాన్సర్ రిస్క్
ప్లాస్టిక్ బాక్స్ లో ఉండే మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి వెళితే క్యాన్సర్ వంటి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.ప్లాస్టిక్ డబ్బాలలో తినే కంటే స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు ఆహారం పెట్టుకోవడానికి, తినడానికి చాలా మంచిదని చెబుతున్నారు. గ్లాస్ కంటైనర్లు వినియోగించినా మంచిదేనని చెబుతున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కంటే కాపర్, స్టీల్ వాటర్ బాటిల్స్ వాడడం మంచిదని చెబుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే టిఫిన్ బాక్స్ లను, కంటైనర్లను ఆహారాన్ని పెట్టుకోవడానికి తినడానికి వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+