కొరమీను చేపలు తింటున్నారా? వీటి స్పెషాలిటీ తెలిస్తే వదిలిపెట్టరు!
చాలామంది చేపలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చేపలలో రకరకాలు ఉంటాయి. వాటిల్లో కొరమీను చాప చాలా స్పెషల్. కోరమీను చేపను బొమ్మే, మట్టగిడస, కొర్ర మట్ట వంటి విభిన్న పేర్లతో పిలుస్తుంటారు.ఎందుకు కొరమీను చేప ఇంత స్పెషల్? ఇది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం .
ఆరోగ్యాన్నిచ్చే కొరమీను
మాంసాహారం తినేవాళ్లు చికెన్, మటన్ కి బదులుగా చేపలు తింటే మంచిదని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మాంసాహారులకు చేపలు బెస్ట్ ఫుడ్. అయితే ఆ చేపలలో కూడా కొన్ని రకాల చేపలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాంటి చేపలలో కోరమీను ఒకటి.

పోషకాలు పుష్కలంగా ఉండే కొరమీను
చెరువులు, జలాశయాలు, నదులలో లభించే ఈ మంచినీటి చేప కొరమీనుకు మిగతా చేపల కంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని ధర కూడా మిగతా వాటి కంటే ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాములు కొరమీను చేప మాంసంలో 16.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 140 మిల్లీగ్రాముల క్యాల్షియం, 0.5 మిల్లీగ్రాముల ఐరన్, 1080 ఎం సి జి జింక్, 94 క్యాలరీలు ఉంటాయి.
ఈ చేపలతో అధిక బరువుకు చెక్
అంతేకాదు కొరమీను చేపలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కొరమీను చేపలు తినడం వల్ల మన బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల మన బరువు నియంత్రణలో ఉంటుంది.
మానసిక ఒత్తిడిని తగ్గించే చేపలు
కొరమీను చేపలు ఉండే గ్లైసిన్, అరాకిడోనిక్ యాసిడ్ మన శరీరం పైన ఏర్పడిన గాయాలను మాన్పడానికి ఎంతగానో ఉపయోగపడతాయి గాయాలతో ఉన్నవారు కొరమీను చేపను తింటే త్వరగా గాయాలు మానుతాయి. చేపల చర్మం లో ఉండే సెరిటోనెర్జిక్ పదార్థాలు మన మానసిక ఒత్తిడిని తగ్గించి యాంటీ డిప్రెజెంట్ గా పనిచేస్తాయి. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన పోషక విలువలు కోరమీను చేపలలో ఉంటాయి.
అనేక అనారోగ్యాలకు అద్భుతంగా పని చేసే కొరమీను
కొరమీను చేపలను తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. చర్మ సంబంధిత తామరవ్యాధికి కోరమీనుతో చికిత్స చేస్తారు. కొరమీను చేపలు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శరీరంలో నొప్పులు, వాపులు, మంటలు తగ్గించే అద్భుతమైన గుణాలు కొరమీనులో ఉన్నాయి. అందుకే ఎన్ని చేప జాతులు ఉన్నప్పటికీ కొరమీను చేప చాలా స్పెషల్. దీని రుచి కూడా అంతే స్పెషల్.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications