బోటీ కూర తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!!
చాలామంది మటన్ బోటీ కూరను చాలా ఇష్టంగా తింటారు. గొర్రె లేదా మేకలలోని పేగులు, పొట్ట భాగం బోటిగా తింటారు. దీనిని చాలా ప్రాంతాలలో ప్రత్యేకమైన డిష్ గా చెబుతారు. ఫంక్షన్లలోనూ అనేక సందర్భాలలో ప్రత్యేక ఆహ్వానితులకు ఈ బోటి కూరను స్పెషల్ గా వడ్డించే ఆనవాయితీ కూడా ఉంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బోటీ కూరను చాలా ఇష్టంగా తింటారు.
మటన్ బోటీ లో ఫుల్ పోషకాలు
గొర్రె పేగులు మరియు పొట్ట భాగం నుంచి తయారయ్యే బోటీ కూరలో పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయని బోటి మంచి పౌష్టిక ఆహారమని చెబుతారు. మటన్ బోటీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మటన్ బోటీ లో కొవ్వులో కరిగే విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, మరియు విటమిన్ కె ఉంటాయి. అలాగే బి విటమిన్, బీ6, బి12 విటమిన్లు కూడా మటన్ బోటీలో ఉంటాయి.

మటన్ బోటీతో ఆరోగ్యం
ఐరన్, జింక్, సెలీనియం,కోలీన్ వంటి ఖనిజాలు కూడా మటన్ బోటీలో ఉంటాయి. మటన్ బోటీలో కేలరీలు సంతృప్త కొవ్వు మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. పుష్కలమైన ఖనిజాలు, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే గొప్ప లక్షణాలు మటన్ బోటీ కి ఉన్నాయి.
ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి మటన్ బోటీ
మటన్ బోటీని తింటే దానిలో ఉండే విటమిన్ బి12 మరియు ఐరన్ కారణంగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల పునరుత్పత్తి జరుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తహీనత తగ్గుతుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మటన్ బోటీ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు కీలకపాత్ర పోషిస్తాయి.
ఇమ్యూనిటీని పెంచే మటన్ బోటీ
సహజంగా మనం కొన్ని పోషకాలను సరిగ్గా తీసుకోకపోవడం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది. మటన్ బోటి తిన్నవారిలో రోగనిరోధకశక్తి గణనీయంగా పెరుగుతుంది. మటన్ బోటీలో ఉండే పోషకాలతో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మటన్ బోటీలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఎవరైనా డయేరియా మరియు జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మటన్ బోటీని తిన్నట్లయితే వారికి ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
నరాలకు, కండరాలకు శక్తి
మటన్ బోటీలో ఉండే పోషకాలు నరాలకు శక్తినిస్తాయి. ఎన్నో విలువైన విటమిన్లు,ప్రోటీన్లు పోషకాలు ఉన్న మటన్ బోటీని తీసుకుంటే మన కండరాలు బలోపేతం అవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మటన్ బోటీని ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే మంచిది. అతిగా తింటే ఆరోగ్యానికి హానికరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications