సంక్రాంతి పండుగ పిండివంటలు అతిగా తింటున్నారా? జాగ్రత్త!

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పిండి వంటల హడావిడి కొనసాగుతుంది. ఇక పిండి వంటలు చేశారు కదా అని ఇష్టారాజ్యంగా నోరు కంట్రోల్ లేకుండా చాలామంది తింటూ ఉంటారు. అయితే పండుగ పిండి వంటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది పడితే అది ఎడాపెడా తింటే అనవసరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

పిండి వంటలు ఇష్టం వచ్చినట్టుగా తింటే రకరకాల అనారోగ్య సమస్యలు
పండుగ సమయంలో చేసిన పిండి వంటలతో జాగ్రత్తగా ఉండాలని ఆ పిండి వంటలను కూడా సెలెక్టివ్ గా తినాలని మితంగా తినాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ఇష్టం వచ్చినట్టుగా తింటే రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని పిండి వంటలు మన శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అటువంటి వాటిని తినడం మంచిది.

Are you eating too many food items during the Sankranti festival Be careful

ఇవి తినొచ్చు.. వీటి విషయంలో జాగ్రత్త
ఉదాహరణకు సున్నుండలు, నువ్వుండలు, రాగి లడ్లు, పల్లి ఉండలు ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇటువంటి వాటిని తినడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ చక్కెరతో తయారు చేసిన స్వీట్లు, బియ్యం పిండితో తయారుచేసిన పిండివంటలు మన శరీరంలో క్యాలరీలను అధికంగా పెంచుతాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అతిగా తింటే జీర్ణ సమస్యలు
ఇక ఇంట్లో పిండివంటలు ఉన్నాయని ప్లేట్లకు ప్లేట్లు తినకుండా మితంగా తినాలి. ఏదో కొద్దిగా టేస్ట్ చూసే నిమిత్తం తింటే పర్వాలేదు కానీ అదే పనిగా అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక పిండి వంటలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఇంటికి వెళ్లిన పిండివంటలను ఈ సమయంలో ఆఫర్ చేస్తారు. కాబట్టి అక్కడ కూడా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి .

తినే ఆహారంపైన ప్రత్యేక దృష్టి
పెట్టారు కదా అని ఇష్టం వచ్చినట్టు తింటే అజీర్ణం సమస్య వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక పండుగ సమయంలో పిండివంటలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతాము. బరువు పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పండుగ సమయాలలో పిండివంటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కచ్చితంగా ప్రతి ఒక్కరు తినే ఆహారం పైన ప్రత్యేకమైన దృష్టి సారించి బరువు పెరగకుండా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. ఏది తిన్నా కాస్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+