ప్యాకెట్ పాలను అతిగా మరిగిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

చాలామంది ప్యాకెట్ పాలను ప్రతిరోజు తాగుతూ ఉంటారు. అయితే ప్యాకెట్ పాలను తాగేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించకూడదు. గంటల తరబడి ప్యాకెట్ పాలను మరిగిస్తే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. కాబట్టి ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించి తాగడం మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు.

పాలను అతిగా మరిగిస్తున్నారా?
మన రోజు వారి ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పాలల్లో ఉండే క్యాల్షియంతో పాటు పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు తాగటం వలన మన ఎముకలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యానికి దోహదం చేసే పాలను ప్రతి ఒక్కరు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు పాలు తాగిస్తారు. అయితే ఈ పాలల్లో పోషకాలు ఉండాలంటే వాటిని అతిగా మరిగించడం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.

Are you Overboiling a packaged milk But know these facts

పాశ్చరైజ్డ్ పాలు మరిగించటం వలన నష్టం ఇదే
ప్యాక్ చేసిన పాలను పాశ్చరైజ్ చేస్తారు. పాలను సాధారణంగా 71 డిగ్రీల సెల్సియస్ కు వేడి చేస్తారు. మళ్ళీ సున్నా డిగ్రీల వద్ద కూల్ చేస్తారు. 71 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. ఇలా మళ్ళీ వివిధ రకాల అనారోగ్యాలకు, వ్యాధులకు కారణమయ్యే అన్ని బ్యాక్టీరియాలను చంపి పాలను ప్యాక్ చేస్తారు. పాశ్చరైజ్డ్ పాలను మళ్లీ మరిగించడం వల్ల పాలలోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.

ప్యాకెట్ పాలు ఎక్కువ సేపు మరిగించకూడదు
పాశ్చరైజ్డ్ పాలు 71 డిగ్రీల సెల్సియస్ వద్ద మరగబెట్టడం వల్ల వివిధ ప్రక్రియలకు లోనవుతాయి. పాలల్లో రోగకారక సూక్ష్మజీవులను గణనీయంగా తగ్గించడానికి పాశ్చరైస్ చేస్తారు. ఈ విధానంలో మైక్రో ఆర్గానిజంల సంఖ్య గణనీయంగా తగ్గించి పాలను వాడుకొనేందుకు యోగ్యంగా మారుస్తారు. ఆ తర్వాత మళ్లీ మనం వాటిని కొనుగోలు చేసిన తర్వాత మరగబెట్టడం వల్ల ఆ పాలల్లో ఉండే పోషకాలు, ప్రాథమిక విటమిన్లు అన్ని దెబ్బతింటాయి.

పాల ప్యాకెట్లను వాడేటప్పుడు జాగ్రత్త
కనుక ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించడం కంటే ఐదు నిమిషాలు వేడి చేయడం మంచిది. అంతేకాదు ప్యాకెట్ పాలను అదే రోజు వినియోగిస్తే మంచిది. ఇక ఈ విషయాలను పాల ప్యాకెట్లు వాడే వాళ్ళందరూ గుర్తుంచుకొని తదనుగుణంగా పాల ప్యాకెట్లను వినియోగిస్తే ఆ పాలు మీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+