పగటిపూట నిద్రపోతున్నారా? అయితే ఈ రోగాలకు రెడీ అవ్వండి!
మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర మనిషి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. మన శరీరంలోని సమస్యలను నిద్ర రిపేర్ చేస్తుంది. ప్రతిరోజు రాత్రి వేళ ఎటువంటి నిద్ర భంగాలు లేకుండా ఎనిమిది గంటలపాటు నిద్ర పోయినవారు ఆరోగ్యవంతులు. అయితే చాలామంది రాత్రి సమయాల్లో నిద్రపోకుండా పగలు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఇది చాలా దుష్ప్రభావాలను మన ఆరోగ్యం మీద కలిగిస్తుంది.
పగటి నిద్ర పోయే వాళ్ళకు సమస్యలు ఇలా
పగటిపూట నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పగటి నిద్ర కారణంగా మన శరీరంలో జరిగే జీవ క్రియలు బాగా తగ్గిపోతాయి. మన శరీరానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం పగలు నిద్ర పోతే చెడిపోతుంది. శరీరంలో జీర్ణ వ్యవస్థ, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు సరిగ్గా పనిచేయడానికి విడుదల కావాల్సిన హార్మోన్లు పగలు నిద్ర పోయే వారిలో ఉత్పత్తి కావు.

పగలు నిద్ర పోవటం వల్ల దుష్ప్రభావాలు
పగటి నిద్ర కారణంగా శరీరంలో మెటబాలిజం బాగా తగ్గుతుంది. మెటబాలిజం తగ్గడంతో మన శరీరంలో ఉండే రోగాలు రెట్టింపు అవుతాయి. పగలు నిద్ర పోవటం కారణంగా ఒబేసిటీ ఎక్కువవుతుంది. అప్పటికే లావుగా ఉన్నవాళ్ళు పగలు నిద్రపోతే మరింత లావుగా తయారవుతారు. పగటి నిద్ర వల్ల వీక్ గా ఉన్నవారు మరింత వీక్ గా మారుతారు. అందుకే పగటిపూట నిద్ర ఏ మాత్రం మంచిది కాదు.
పగటి నిద్రతో ఊబకాయం, డయాబెటిస్ రిస్క్
ఒకవేళ ఎవరైనా పగటిపూట అలసటగా ఉండి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలంటే ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకుని ఒక అరగంట పాటు నిద్ర పోతే మంచిది. అంతకు మించి నిద్రపోతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువగా పగటిపుట నిద్రపోయే వారిలో ఊబకాయులుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గంటలు గంటలు పగటిపూట నిద్రపోవడం వలన గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
పగటి నిద్రతో మానసిక సమస్యలు కూడా
పగటిపూట నిద్ర కారణంగా శరీరం యాక్టివ్ నెస్ తగ్గుతుంది. పగటి పూట నిద్ర కారణంగా మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం చేసే పనిలో ప్రొడక్టవిటీ తగ్గుతుంది. అందుకే పగటి పూట నిద్ర పనికి చేటు అంటారు. పగటిపూట నిద్రమానుకుని, రాత్రివేళ చక్కగా ఎనిమిది తొమ్మిది గంటల వరకే పడుకుని నిద్రపోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగు పడుతుంది.
పగలు నిద్రకు స్వస్తి పలికి రాత్రి నిద్ర అలవాటు చేసుకోండి
రాత్రంతా మెలకువగా ఉండి పగలు పడుకుంటే ఏ పని సరిగ్గా చెయ్యటం సాధ్యం కాదు. శరీర ధర్మం ప్రకారం రాత్రిపూట నిద్రపోతేనే మంచిది. అందుకే పగలు నిద్రకు స్వస్తి పలికి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించండి. సుఖవంతమైన నిద్ర మన జీవితాన్ని సంతోషాలతో, ఆరోగ్యంతో నింపుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications