బరువు తగ్గాలని కష్టపడుతున్నారా? అయితే ఈ తప్పులు అస్సలే చెయ్యొద్దు!

ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. ఈ ఊబకాయం నుంచి బయటపడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నారు. అలా వెయిట్ లాస్ కావాలనుకుని తెలియక చేసే తప్పుల కారణంగా నష్టం ఎక్కువ జరుగుతుంది. బరువు తగ్గాల్సిన చోట ఇంకా బరువు పెరుగుతున్న వారు చాలామంది ఉన్నారు.

ఈ తప్పుతో బరువు పెరుగుతారు
బరువు తగ్గేందుకు చాలా మంది చేసే ప్రయత్నం ఒక్కోసారి సరైన రిజల్ట్స్ ఇవ్వడం లేదు. అసలు వెయిట్ లాస్ జర్నీ వేళ వాళ్ళు చేస్తున్న తప్పులు ఏమిటి? అనేది ఒకసారి చూద్దాం.
బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్న వారు బరువు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఒత్తిడి. ఒత్తిడి కారణంగా మూడ్ మారిపోయి ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఇది వెయిట్ లాస్ జర్నీని ఘోరంగా దెబ్బతీస్తుంది.

Are you struggling to lose weight But don t make these mistakes

ఇలా చేస్తే అసలే బరువు తగ్గరు
ఇక కొంతమంది బరువు తగ్గాలనుకొని మొత్తానికే తినడం మానేస్తారు. దీని వల్ల బరువు తగ్గే ప్రక్రియ చాలా నిదానిస్తుంది. ఇలాంటి వారికి బాగా ఆకలి వేయడం వల్ల ఒకేసారి ఎక్కువ తింటారు. ఫలితంగా బరువు పెరుగుతారు. ఇక కొంతమంది బరువు తగ్గాలని భావించేవారు శరీరానికి కావలసినంత ప్రోటీన్ ఇవ్వరు. మన శరీరానికి కావలసిన ప్రోటీన్ అందక పోయినా బరువు తగ్గడం కష్టం.

బరువు తగ్గించటంలో నీళ్ళ పాత్ర
చాలామంది బరువు తగ్గాలని భావించేవారు ఫైబర్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఫైబర్ ను ఆహారంలో భాగంగా తీసుకోకపోతే బరువు తగ్గడం ఈజీ కాదు. కాబట్టి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ను డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇక వెయిట్ లాస్ కావాలని భావించేవారు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. శరీరానికి కావాల్సినంత నీటిని తప్పక తీసుకోవాలి. శరీరానికి కావలసిన నీళ్లు తాగకపోయినా బరువు తగ్గరు.

డైలీ రొటీన్ లేకున్నా బరువు తగ్గటం కష్టమే
నీళ్లు తాగడం మూలంగా శరీరంలోని మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. బరువు తగ్గడం సునయాసమవుతుంది. ఇక ఆహారం విషయంలో, వర్కౌట్స్ విషయంలో కచ్చితంగా డైలీ రొటీన్ ఉండాలి ఈ డైలీ రొటీన్ లేకపోయినా అంత ఈజీ కాదు కాబట్టి బరువు తగ్గాలని భావించేవారు పైన పేర్కొన్న కొన్ని పొరపాట్లు చేయకుండా బరువు తగ్గడానికి ఆహారం మీద తీసుకునే నీటి మీద చేసే వ్యాయామం మీద ఒత్తిడి లేని జీవితం మీద ఫోకస్ చేయాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+