పొట్ట తగ్గాలంటే.. సింపుల్.. ఇలా చేయండి!!

ఎక్కువ మంది తమకు పొట్ట ఉండటాన్ని చాలా అవమానకరంగా భావిస్తుంటారు. పదిమందిలో పొట్టను పట్టుకొని తిరగడమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారుకానీ తగ్గించుకోలేరు. అది తగ్గక ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయరు. తిండి కూడా తినకుండా కడుపు మాడ్చుకుంటూ, జిమ్ లో చెమటలు కక్కుతూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు.. డబ్బులు వృథా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్ గా ఒక అరగంట ఇలా చేస్తే స్లిమ్ అయిపోతారు.

ప్రతిరోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ అరగంట సమయం సైకిల్ తొక్కాలి. అలాచేస్తే ఆరోగ్యంతోపాటు స్లిమ్ గా ఉంటారు. సైకిల్ తొక్కడానికి చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. ఎవరైనా సైకిల్ తొక్కొచ్చు. శారీరక, మానసిక అనారోగ్యంతో బాధపడేవారు రెగ్యులర్ గా సైకిల్ తొక్కాలి. వయసునుబట్టి, శక్తిని బట్టి అరగంట సమయం సైకిల్ తొక్కితో ఎన్నో లాభాలున్నాయి. సైక్లింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంతోపాటు శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని ఇతర భాగాలకు సరైన రీతిలో ఆక్సిజన్, పోషకాలు అందించడంలో తోడ్పడుతుంది.

are you suffering from stomach

అలాగే బరువును కూడా నియంత్రిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. మెదడులోని ప్రాంతాలను సక్రియం చేసి దాని పనితీరును మెరుగపరుస్తుంది. తొడలు, తుంటి, ఉదర కండరాలు, భుజాలు బలపడతాయి. మానసిక ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది. మనసు శాంతిని, స్థిరత్వాన్ని పొందాలంటే రోజుకు అరగంట సైకిల్ తొక్కితే చాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+