శరీరంలో ఆ ఫార్ట్స్‌పై పర్‌ఫ్యూమ్ వాడుతున్నారా?

పెర్ఫ్యూమ్స్ మన జీవితంలో ఒక భాగమైంది. ఇవి శరీర సువాసనను మెరుగుపరిచే విధంగా ఉపయోగపడుతుంది.మనకు మంచి వాసనను ఇస్తాయి, కానీ వాటిని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని సరైన విధంగా, సరైన ప్రదేశాల్లో వాడకపోతే అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా, కొన్ని శరీర భాగాల్లో పర్‌ఫ్యూమ్ వాడకపోవడం మంచిది

1. ముక్కు దగ్గర :
పర్‌ఫ్యూమ్‌లో ఉండే కెమికల్స్ చాలా పవర్‌ఫుల్ గా ఉండే వాసన కలిగి ఉంటాయి. ఇవి నేరుగా ముక్కు దగ్గర స్ప్రే చేస్తే ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. కొంతమందికి ముక్కులో మంట, అలర్జీ సమస్యలు ఏర్పడే అవకాశముంది. ప్రత్యేకంగా, ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Are you using perfume on those farts on your body But you re in danger

2. కళ్ల సమీపం :
పర్‌ఫ్యూమ్‌ను ఎప్పుడూ కళ్లకు దగ్గరగా స్ప్రే చేయకూడదు. ఇందులో ఉండే ఆల్కహాల్ , ఇతర రసాయనాలు కళ్లకు హానికరం. పొరపాటున కంటికి తగిలితే కంటి కందిపోతుంది, ఎర్రబడుతుంది, నీరు కారడం మొదలవుతుంది. దీని వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

3. అరచేతులు :
కొంతమంది పర్‌ఫ్యూమ్‌ను అరచేతుల్లో రుద్ది తరువాత మోచేతులపై లేదా మెడపై అప్లై చేస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అరచేతుల ద్వారా అది తినే పదార్థాలకు, కళ్లకు, ముఖానికి తాకే అవకాశం ఉంటుంది. అలాగే, అరచేతులు చాలా సెన్సిటివ్‌గా ఉండటంతో, ఇందులోని కెమికల్స్ వల్ల చర్మం పొడిబారిపోవచ్చు లేదా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

4. ముఖం :
ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పర్‌ఫ్యూమ్‌లో ఉండే కెమికల్స్ ముఖ చర్మానికి తగిలితే దాని నేమోషన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీని వల్ల పొడిబారిన చర్మం, అలర్జీలు, రాషెస్ వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, మొటిమలు ఎక్కువగా వచ్చే సమస్య ఉన్నవారు ముఖంపై పర్‌ఫ్యూమ్ స్ప్రే చేయడం మానుకోవాలి.

5. భుజాలు , ఛాతి :
అల్ట్రావయొలెట్ (UV) కిరణాలు పర్‌ఫ్యూమ్‌లోని కొన్ని రసాయనాలతో మిశ్రమమై చర్మానికి హాని చేస్తాయి. భుజాలు మరియు ఛాతి భాగాల్లో పర్‌ఫ్యూమ్ వాడితే అక్కడ చర్మం గాయపడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, ఈ భాగాల్లో చర్మం ఎక్కువగా ఎర్రబడటం లేదా మచ్చలు రావడం జరుగుతుంది. చాలామంది భుజాల కింద పర్‌ఫ్యూమ్ వాడతారు. కానీ ఇది మంచి ఆచారం కాదు.

6. ప్రైవేట్ భాగాలు
పర్‌ఫ్యూమ్‌ను ప్రైవేట్ భాగాల్లో ఉపయోగించడం చాలా ప్రమాదకరం. అక్కడి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఆల్కహాల్ లేదా ఇతర కెమికల్స్ వాడినప్పుడు తీవ్రమైన అలర్జీ, మంట, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

6. చర్మం గాయం అయిన ప్రదేశాలు:
చర్మంపై ఏదైనా గాయం, కోత, మంట ఉన్న ప్రదేశాల్లో పర్‌ఫ్యూమ్ వాడకూడదు. ఎందుకంటే, ఇందులో ఆల్కహాల్ ఉండటంతో అది మంటను పెంచుతుంది. ఇది నొప్పిని పెంచడమే కాకుండా, గాయం మళ్లీ మంటతో ఎక్కువ కాలం మానిపోవడం కూడా జరుగుతుంది. కొంతమంది మడమల భాగంలో కూడా పర్‌ఫ్యూమ్ స్ప్రే చేస్తారు. కానీ అక్కడ చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. ఎక్కువగా నడిచేటప్పుడు ఇది ఇబ్బంది కలిగించవచ్చు.

సురక్షితంగా పర్‌ఫ్యూమ్ వాడే విధానం:

పర్‌ఫ్యూమ్ సరైన విధంగా వాడకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, కొన్ని శరీర భాగాల్లో పర్‌ఫ్యూమ్ ఉపయోగించకూడదు. దాన్ని సరైన ప్రాంతాల్లో మాత్రమే, తగిన జాగ్రత్తలతో వాడితే, అది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే అద్భుతమైన సహాయకారిగా మారుతుంది. పర్‌ఫ్యూమ్‌ను చర్మంపై నేరుగా ఎక్కువ స్ప్రే చేయొద్దు. కడిగిన తర్వాత శుభ్రమైన చర్మంపై మాత్రమే అప్లై చేయాలి. బట్టల మీద పర్‌ఫ్యూమ్ స్ప్రే చేయడం ఉత్తమం. తీవ్రమైన అలర్జీ సమస్యలున్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+