Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫోన్ చూస్తూ ఆ పని చేస్తున్నారా..? మీ కొంప కొల్లేరే

ఆరోగ్యవంతమైన జీవనం కోసం చాలా మంది వ్యాయామాలను ఆశ్రయిస్తారు. వీటిలో వాకింగ్ (Walking) అన్నింటికంటే సులభమైన , ప్రభావవంతమైన వ్యాయామం. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలోపేతం అవ్వడమే కాకుండా, శరీరంలోని కేలరీలు (calories) మరియు కొలెస్ట్రాల్ (cholesterol) కరిగి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే, చాలామంది వాకింగ్ చేసే సమయంలో కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు వాకింగ్ వల్ల వచ్చే పూర్తి ప్రయోజనాలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాకింగ్ సమయంలో చేయకూడని పొరపాట్లు:

వేగంలో హెచ్చుతగ్గులు: తక్కువ వేగంతో నడవడం వల్ల కేలరీలు బర్న్ కావు. అదే ఒక్కసారిగా వేగం పెంచినా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే, మొదటి ఐదు నిమిషాలు నెమ్మదిగా నడిచి, ఆ తర్వాత క్రమంగా వేగాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒకసారి 5 నిమిషాలు వేగాన్ని పెంచుకుంటూ ఉండటం ఉత్తమం.

Are You Walking Don t Make These Mistakes Or You Won t Get Any Benefits

ఫోన్ చూస్తూ నడవడం: వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడటం, మెసేజ్‌లు టైప్ చేయడం చాలా మందికి అలవాటు. దీనివల్ల దృష్టి వాకింగ్‌పై ఉండదు, అంతేకాకుండా వెన్ను, మెడ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్ పక్కన పెట్టి నడకపైనే దృష్టి పెట్టడం మంచిది.

ఖాళీ కడుపు లేదా అతిగా తిన్న తర్వాత నడవడం: ఖాళీ కడుపుతో నడవడం వల్ల శక్తి తగ్గి త్వరగా అలసిపోతారు. అదే అతిగా తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. వాకింగ్‌కి ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, వాకింగ్ వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను పొంది, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. యువత రోజుకు 40-60 నిమిషాలు నడిస్తే, మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలయ్యి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కాబట్టి, సరిగ్గా నడవండి, ఆరోగ్యంగా ఉండండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+