Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అశ్వగంధ... అందాన్ని రెట్టింపు చేస్తుంది!

అశ్వగంధ ను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇండియన్‌ జిన్‌సెంగ్‌ అని పిలుస్తుంటారు. సప్లిమెంట్ రూపంలో, టీగా, పౌడర్ గా తీసుకోవచ్చు. ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటరని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అశ్వగంధను తీసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది : ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడికి గురవడానికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.

 ashwagandhapowder

మెదడు పనితీరు మెరుగవుతుంది : జ్ఞాపకశక్తి, పనితీరును మెరుగుపరుస్తుంది. రియాక్షన్‌ సమయం, విజువల్‌ మోటర్‌ సమన్వయం, అటెన్షన్‌ స్పాన్‌ను తగ్గిస్తుందని ఇప్పటిలకే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతే కాకుండా దెబ్బతిన్న మెదడు కణాలను కూడా అశ్వగంధ బాగుచేస్తుంది.

హార్మోన్ల బ్యాలెన్స్ : హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధిని నియంత్రిస్తుంది. మొత్తం హార్మోన్ల వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ది సంతానోత్పత్తి సామర్థ్యం, టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది. పీసీఓడీ, ఇతరత్రా నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది దివ్యౌషధం

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది : క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, గుండె పోటును నివారిస్తుంది.

రక్తప్రసరణను మెరుగవుతుంది : రక్త ప్రసరణను పెంచి స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి పెరిగేలా చేస్తుంది. సంతానం లేనివారు దీన్ని ప్రతిరోజు తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ శాతం పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ శాతం పెరగడంతో కండరాలు కూడా బలోపేతమవుతాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ :ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపు, మంటను తగ్గించడంలో తోడ్పడతాయి. ఆర్థరైటిస్, ఆస్తమా, దీర్ఘకాలిక నొప్పికి కూడా గొప్ప ఔషధం. కీళ్ల నొప్పులను తగ్గించడంతోపాటు నిద్రలేమిని తగ్గిస్తుంది. మతిమరుపుతో బాధపడుతున్నవారికి అశ్వగంధ మంచి ఔషధం.

అందం రెట్టింపవుతుంది : ఒత్తిడికి గురైతే కార్డిసోల్ హార్మోన్ విడుదలువుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. ఆ హార్మోన్ ప్రభావాన్ని చర్మంపై పడకుండా అశ్వగంధ కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రాకుండా నిలువరిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. కంటికింద నల్లని వలయాలు, ముడతలను దూరం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+