కళ్ళ క్రింద క్యారీ బ్యాగులా... ఈ సింపుల్ టిప్స్ తో మాయం!

చాలామందికి వయసుతో పాటు కళ్ళకింద వలయాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కళ్ళ కింద వలయాలు మన వయసును మరింత పెంచేస్తాయి. ఇక ఇటీవల కాలంలో చిన్న వయసు వారు కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగులతో నల్లటి వలయాలతో తెగ బాధపడుతున్నారు. అయితే మనం ఇంట్లో పాటించే చిన్న చిన్న టిప్స్ తో కళ్ళ కింద క్యారీ బ్యాగులను మాయం చేయవచ్చని చెబుతున్నారు.

కళ్ళ క్రింద క్యారీ బ్యాగులకు ఇంటి వైద్యం
ఇక ఆ టిప్స్ విషయానికి వస్తే కళ్ళ కింద క్యారీ బ్యాగులు మాయం కావాలంటే మనం ఇంట్లోనే సహజ సిద్ధమైన టిప్స్ ను ఫాలో చేయొచ్చు. కొద్దిగా ఉల్లి రసాన్ని పిండి అందులో కొంచెం ఉప్పు కలిపి కళ్ళ కింద ఉన్న క్యారీ బ్యాగులకు పూసినట్లయితే వాపు తగ్గుతుంది.

Bags under the eyes Get rid of them with these simple tips

ఈ టిప్స్ ట్రై చేసి చూడండి
రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పూసి మరుసటి రోజు పొద్దున్నే చల్లటి నీటితో కడుక్కునట్లయితే ఉల్లిపాయల రసంలో ఉండే కెమికల్స్ కళ్ల చుట్టూ కొవ్వు పేరుకు పోవడాన్ని ఆపుతాయి. అయితే వీటిని పూసుకునే సందర్భంలో కళ్ళకు తగలనీయకండి. అంతే కాదు వెల్లుల్లిని దంచి పేస్ట్ గా చేసి ఐ బ్యాగ్స్ పైన అప్లై చేసి, ఓ అరగంట పాటు ఉంచి చల్లటి నీళ్లతో కడుక్కుంటే మంచిది.

ఈ ఫుడ్ తోనూ కళ్ళ క్రింద క్యారీ బ్యాగులు మాయం
ఇది మన కళ్ళ క్రింద పైన పేరుకుపోయిన కొవ్వుల స్థాయిని తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి కంటి కింద అప్లై చేస్తే ఇది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం ద్వారా, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ విటమిన్ లను అధికంగా తీసుకోవడం ద్వారా కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగులను తగ్గించవచ్చు.

వాటర్ తాగితే కూడా కళ్ళ క్రింద వాపులు మాయం
అధికంగా నీరు తాగడం ద్వారా కూడా కళ్ళ వాపులను, కళ్ళకింద నల్ల వలయాలను, క్యారీ బ్యాగులను తగ్గించుకోవచ్చు. కళ్ళకు కోల్డ్ కంప్రెస్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కళ్ళలో వచ్చే ఈ ఫ్లూయిడ్ అసమతుల్యతలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు కళ్ళ కింద క్యారీ బ్యాగులు తగ్గాలంటే మంచి పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+