ఓవెన్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ "ఎగ్ పఫ్స్" ఎలా చేయాలంటే..?

కోడిగుడ్డు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. అత్యంత పోషక విలువలతో కూడిన గుడ్లతో చేసే ఏ వంటకమైనా ప్రతి ఒక్కరికీ నచ్చేస్తుంది. త్వరగా తయారవడం, అద్భుతమైన రుచితోపాటు పూర్తి పోషకాహారం కావడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. సాధారణంగా బుర్జీ, పులుసు, ఆమ్లెట్, కర్రీ వంటి వంటకాలు తరచూ చేస్తుంటారు.

అయితే బేకరీ ఐటమ్స్‌లో చాలా మందికి ఎప్పటికీ ఫేవరెట్ స్నాక్ అంటే ఎగ్ పఫ్స్ అనే చెప్పాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ స్నాక్‌ను ఇంట్లో చేయాలంటే తప్పనిసరిగా ఓవెన్ కావాలనేది చాలామందిలో ఉన్న అపోహ. కానీ సరైన టెక్నిక్ పాటిస్తే ఓవెన్ లేకుండానే, స్టవ్‌పైనే బేకరీలో కొన్నట్లే క్రిస్పీ ఎగ్ పఫ్స్ తయారు చేయవచ్చు. ఇంట్లోనే ఈజీగా టేస్టీ టేస్టీగా ఎగ్ పఫ్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

bakery-style-egg-puffs-making-recipe-in-telugu

ఎగ్ పఫ్స్ తయారీకి కావాల్సిన పదార్దాలు..

పఫ్ పేస్ట్రీకి :

మైదా - 1 కప్పు

బటర్ - 50 గ్రాములు

చక్కెర - ¼ టీస్పూన్

ఉప్పు - ¼ టీస్పూన్

చల్లటి నీరు - అవసరమైనంత

ఎగ్ స్టఫింగ్ :

నూనె - 1 టేబుల్ స్పూన్

ఉల్లిపాయలు - 2 (మీడియం సైజ్, సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ½ టీస్పూన్

పసుపు - చిటికెడు

కారం - ½ టీస్పూన్

ధనియాల పొడి - ½ టీస్పూన్

జీలకర్ర పొడి - ½ టీస్పూన్

చాట్ మసాలా - ½ టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

ఎగ్స్ కోసం:

గుడ్లు - 2 (ఉడికించినవి)

మిరియాల పొడి - కొద్దిగా

కారం, ఉప్పు - స్వల్పంగా

తయారీ విధానం..

పఫ్ పేస్ట్రీ పిండిని సిద్ధం చేసే విధానం :

ముందుగా ఒక గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.

ఈ పిండిని మూతపెట్టి అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వల్ల పఫ్స్ మరింత లేయర్స్‌తో క్రిస్పీగా వస్తాయి.

బటర్‌ను గది ఉష్ణోగ్రత వద్ద మెత్తగా చేసుకోవాలి. రెస్ట్ ఇచ్చిన పిండిని మరో రెండు నిమిషాలు బాగా ముద్ద చేసి, చపాతీ పీటపై దీర్ఘచతురస్రాకారంలో రోల్ చేయాలి.

ఇప్పుడు దానిపై 25 గ్రాముల బటర్‌ను పూర్తిగా అప్లై చేసి, కొద్దిగా పొడి మైదా చల్లాలి. పిండిని పుస్తకంలా మూడు మడతలు వేసి ఫోల్డ్ చేయాలి.

ఇలా చేసిన పిండిని ప్లేట్‌లో పెట్టి తడి గుడ్డ కప్పి డీప్ ఫ్రీజర్‌లో అరగంట ఉంచాలి.

ఎగ్ స్టఫింగ్ :

పాన్ వేడి చేసి నూనె వేసి, పచ్చిమిర్చి - ఉల్లిపాయలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మసాలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.

ఫ్రీజర్ నుంచి పిండిని తీసి మరోసారి రోల్ చేసి మిగిలిన బటర్ అప్లై చేయాలి. మళ్లీ పొడి మైదా చల్లి పుస్తకంలా ఫోల్డ్ చేసి మరోసారి అరగంట ఫ్రీజర్‌లో ఉంచాలి.

పఫ్స్ షేప్ చేయడం :

ఫ్రీజర్ నుంచి పిండిని తీసి సగానికి కట్ చేయాలి. ఒక్కో భాగాన్ని స్క్వేర్ షేప్‌లో రోల్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.

ఉడికించిన గుడ్లను సగానికి కట్ చేసి, వాటిపై కొద్దిగా మిరియాల పొడి, కారం, ఉప్పు చల్లాలి.

ఎగ్ పఫ్స్ ఫిల్లింగ్ & ఫోల్డింగ్ :

ప్రతి పఫ్ పేస్ట్రీపై ముందుగా ఆనియన్ మసాలా వేసి, దానిపై గుడ్డు (కట్ చేసిన వైపు మసాలాకు అంటేటట్లు) పెట్టాలి.

పేస్ట్రీ అంచులకు కొద్దిగా నీరు లేదా పాలు రాసి, ఎగ్ పఫ్ షేప్‌లో ఫోల్డ్ చేసి అంచులు బాగా సీల్ చేయాలి.

ఓవెన్ లేకుండా బేకింగ్ చేసే పద్ధతి :

స్టవ్‌పై లోతైన గిన్నె పెట్టి అందులో స్టాండ్ వేసి 5 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. బేకింగ్ ప్లేట్‌కు కొద్దిగా బటర్ లేదా నూనె అప్లై చేసి ఎగ్ పఫ్స్ అమర్చాలి.

( స్టీల్ పాత్రలు కాలిపోతాయి, కాబట్టి ఈ పద్ధతిలో అల్యూమినియం గిన్నె వాడటం మంచిది )

బేకింగ్ టైమ్ & ఫ్లేమ్ సెట్టింగ్ :

మీడియం ఫ్లేమ్‌లో 30-35 నిమిషాలు ఒక వైపు బేక్ చేయాలి. తర్వాత పఫ్స్‌ను తిప్పి మరో 5-10 నిమిషాలు బేక్ చేయాలి.

పఫ్స్ బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

సర్వింగ్ & స్టోరేజ్ టిప్స్..

వేడివేడిగా టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి

బయట చల్లారిన తర్వాత ఎయిర్‌టైట్ బాక్స్‌లో ఉంచితే ఒక రోజు వరకు బాగుంటాయి

రీహీట్ చేయాలంటే తవ్వాలో లేదా స్టవ్‌పై కొద్దిసేపు వేడి చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+