నయా స్టైల్ బీరకాయ కొత్తిమీర పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!
బీరకాయ కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. కొంతమంది బీరకాయ కర్రీలో పాలు పోసి చేస్తారు. ఇంకొంతమంది బీరకాయ పచ్చడి, బీరకాయ టమాటా కర్రీ చేసుకుంటారు. అయితే బీరకాయతో ఇలా నయా స్టైల్ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ బీరకాయ కొత్తిమీర పచ్చడి ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్లీ మళ్లీ చేసుకుంటారు. మరి ఈ టేస్టీ బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బీరకాయ కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. నూనె నాలుగు టేబుల్ స్పూన్ లు, ధనియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ లు, పల్లీలు రెండు టేబుల్ స్పూన్ లు, వెల్లుల్లి రెబ్బలు పది, పచ్చిమిర్చి తగినన్ని, బీరకాయలు హాఫ్ కేజీ, టమాటోలు మూడు, ఉల్లిపాయ ఒకటి , పసుపు చిటికెడు, ఉప్పు తగినంత ,చింతపండు కొద్దిగా, కొత్తిమీర తురుము తీసుకోవాలి.
బీరకాయ కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా బీరకాయలను మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. తగినంత నూనె వేయాలి. ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆ మిశ్రమం చల్లారిన తర్వాత రోట్లో లేదా మిక్సీ జార్ లో వేయాలి. కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి. కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పండిన టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత చింతపండు వేసి టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తమీర తరుగు వేసి ఉడికించి దింపేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని రోట్లో లేదా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి. అందులో ఆవాలు, మినపప్పు, పచ్చి శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపుకుంటే సరి..












Click it and Unblock the Notifications