పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారు ప్రతిరోజు ఈ డ్రింక్ తాగాలి

ప్రతిరోజు మంచి ఆహారం తీసుకునేందుకు గుప్పెడు డ్రైఫ్రూట్స్ తినమని వైద్యులు చెబుతుంటారు. ఈ డ్రైఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా ఒకటి. పురుషుల్లో ఎముకలు గట్టిగా ఉండటంతోపాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. అదేమిటంటే.. ప్రతిరోజు కప్పు పాలలో ఖర్జూరాలు వేసి తినాలి. పాలు, ఖర్జూరాలు.. రెండూ ఆరోగ్యకరమైన ఆహారాలు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాల్లో కాల్షియం, ఫైబర్, జింక్, మెగ్నీషియం, ఇనుము వంటి అనేక పోషకాలు ఉంటాయి.

సామర్థ్యానికి..
శారీరకంగా బలహీనంగా ఉండి, లైంగిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు క్రమం తప్పకుండా పాలు, ఖర్జూరం కలిపి తాగాలి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ పెంచడంలో ఖర్జూరం పాత్ర ఎంతో కీలకం. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు పాలల్లో ఖర్జూరాలను కలిపి తింటే వీర్యం పెరిగి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పాలలో కాల్షియం, ఖర్జూరాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భవతులు వీటిని తీసుకోవడం చాలా మంచిది.

Benefits of consuming milk and dates together

నానబెట్టి ఉదయం కూడా తీసుకోవచ్చు
ఖర్జూరాలలో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పాలలోని ప్రోటీన్లు, ఖర్జూరాలలోని సహజ చక్కెరలు కలిసి శరీరానికి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది. ఖర్జూరాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది.

ఖర్జూరాలలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పాలలోని ప్రోటీన్లు, ఖర్జూరాలలోని పోషకాలు కలిసి కండరాలను బలపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో 2-3 ఖర్జూరాలు వేసి నానబెట్టి ఉదయం తీసుకోవచ్చు. పాలలో ఖర్జూరాలను మిక్సీలో వేసి జ్యూస్ లాగా తాగవచ్చు. పెరుగులో, ఓట్స్ లో ఖర్జూరాలను కలిపి తినవచ్చు. మరీ ఎక్కువగా తీసుకుంటే అజీర్తి చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+