ఈ ఆకులు రోజూ తింటే డయాబెటిస్ తో సహా వందల రోగాలకు చెక్!
తమలపాకులు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్న తమలపాకులు మన ఆరోగ్యం పైన మిరాకిల్స్ చేస్తాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. లెక్కకు మిక్కిలి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఔషధంగా తమలపాకులను చెప్పవచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన వైద్యమైన తమలపాకులలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో సుగుణాలు ఉన్నాయి.
తమలపాకులలో గొప్ప ఔషధ గుణాలు
తమలపాకుల్లో టానిన్లు, అల్కలాయిడ్ లు, ప్రోపీన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీంతో తమలపాకులు మన శరీరంలో వాపులను. నొప్పులను తగ్గిస్తాయి. తమలపాకుల రసాన్ని మనం తీసుకుంటే అది మన మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కని పరిష్కారంగా కనిపిస్తుంది. శరీరంలో చిన్న చిన్న గాయాలకు తమలపాకు రసం రాసిన మంచి ఫలితం ఉంటుంది.

తమలపాకులతో డయాబెటిస్ నియంత్రణ
తమలపాకులు నోటి శుభ్రతను కాపాడతాయి. బ్యాక్టీరియాను అరికట్టి చిగుళ్ళు మరియు పళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. డయాబెటిస్ పేషెంట్లకు తమలపాకులు ఓ గొప్ప వరంగా చెప్పవచ్చు. ఇక ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఆ నొప్పుల నుంచి తమలపాకులు ఉపశమనం కలిగిస్తాయి. సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న తమలపాకులు ఆ పనిని చేస్తాయి.
తమలపాకులతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా
తమలపాకులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి. అల్సర్లు రాకుండా చేస్తాయి. తమలపాకులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ల కారణంగా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు కారణంగా వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుంచి తమలపాకులు మనల్ని కాపాడతాయి.
తమలపాకులతో సెక్స్ సామర్ధ్యం పెంపు
జలుబు, జ్వరం వంటి సమస్యలకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి. తమలపాకులు శారీరక ఆనందాన్ని పెంచుతాయి. తమలపాకులు సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే తమలపాకులను ప్రతీరోజూ పరిమితంగా తీసుకుంటే మంచి ప్రయోజనం తప్పకుండా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications