సిగరెట్ తాగేవారి ఊపిరితిత్తులను ఈ రెండూ శుభ్రం చేస్తాయా?
ఆహారంద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యమే కాదు.. ఏ అవయవాల ఆరోగ్యం మెరుగు పడదు. మంచి ఆహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తూ క్రమపద్ధతిలో జీవన విధానాన్ని మార్చుకుంటేనే సాధ్యపడుతుందని, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దని వైద్
ఆహార నియమాల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని పదార్ధాలు కొన్ని జబ్బులను తగ్గిస్తాయని మన ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. అయితే మందుల తరహాలో ఆహారం పనిచేయదని రోసారి రుజువైంది. కాకరకాయ, అల్లం రసం తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రమవుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదని, అయితే ఈ రెండూ తీసుకోవడంవల్ల ఆరోగ్యం మెరుపడుతుందని, దీంతోపాటు పొగతాగే అలవాటు మానుకోవడానికి సహకరిస్తుదని వైద్యులు చెబుతున్నారు.

అమెరికన్ అంగ్స్ అసోసియేషన్
అమెరికన్ లంగ్స్ అసోసియేషన్ కథనం ప్రకారం.. లంగ్స్ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం కలిగి ఉంటాయి. హానికార టాక్సిన్లైన సిగరెట్ తాగడం, గాలి కాలుష్యం నుంచి దూరంగా ఉంటూ ప్రతిరోజు వ్యాయాం చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి ఎటువంటి మందులు, రసాలు తాగాల్సిన అవసరం లేదని, అల్లం యాంటీ వైరల్ గా పనిచేస్తుందని , అల్లం ఆక్సిడేట్స్ నుంచి లంగ్స్ డ్యామేజీని తగ్గిస్తుందన్నారు.

అది అపోహ.. అందులో శుభ్రం లేదు..
కేవలం కాకరగాయ, అల్లం రసం తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడిపోతాయనే దాంట్లో నిజం లేదు. గాలి కాలుష్యానికి దూరంగా ఉంటే చాలని చెబుతున్నారు. అల్లంలోని బయో యాక్టివ్ రసాలు కండరాల రిలాక్సేషన్ కు సహకరిస్తాయి. నికోటిన్ కు ఒకసారి బానిసైతే దాన్ని వదలడం కష్టం. నికోటిన్ ను అలవాటు చేసుకోకుండా ఉండాలని, సిగరెట్లు తాగడం అలవాటైతే మానుకోవడం కష్టమని చెబుతున్నారు. ఈ తరహా అలవాట్లను మానుకోవడానికి అల్లం వాటర్ సహకరిస్తుంది. అంతేకానీ లంగ్స్ శుభ్రమవుతాయనేది మాత్రం అపోహ అని వైద్యులు కొట్టిపారేస్తున్నారు.

సొంత వైద్యం మానుకోవాలి..
సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఆధారంగా చేసుకొని సొంత వైద్యం చేసుకోవడం మానుకోవాలి. కాకారకాయ, అల్లంరసం విచ్చలవిడిగా తాగుతూ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం వల్లే ఆరోగ్యం మెరుగుపడదని, అవయవాల ఆరోగ్యం మెరుగుపడాలంటే అందుకు సంబంధించిన మందులు కూడా వాడుతుండాలి. తర్వాత ఆహార నియమాలు పాటిస్తుండటంతోపాటు లైఫ్ స్టైల్ పద్ధతిగా ఉండేలా చేసుకుంటే చాలు. దురలవాట్లకు దూరంగా ఉంటూ, వ్యాయామం చేస్తే చాలా రోగాలు దూరమవుతాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications