ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా?

రోజూ ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి కాఫీ తాగనిదే చాలామందికి రోజు గడవదు. అయితే, మీరు తాగుతున్న ఆ కాఫీ మీ ఆరోగ్యానికి వరమా? లేక శాపమా? ముంబైకి చెందిన ప్రముఖ డాక్టర్ మనన్ వోరా చెబుతున్న నిజాలు వింటే మీరు కాఫీ తాగే పద్ధతిని ఖచ్చితంగా మార్చుకుంటారు.

కాఫీ అంటే కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది 1000కి పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్న ఒక శక్తివంతమైన మందు. కానీ, దురదృష్టవశాత్తూ చాలామంది భారతీయులు ఈ 'ఔషధాన్ని' తెలియకుండానే 'స్లో పాయిజన్'గా మార్చేస్తున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Black Coffee Benefits Why Milk and Sugar Ruin Your Morning Drink According to Dr Manan Vora

కాలేయానికి 'బ్లాక్ కాఫీ' ఒక రక్షక కవచం..

నిజానికి, బ్లాక్ కాఫీ అనేది కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన సహజ పానీయం. ఇది కాలేయ కణాలను రక్షించడమే కాకుండా, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. డాక్టర్ వోరా మాటల్లో చెప్పాలంటే.. "మనం కొనుక్కునే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లలో కేవలం 20 రకాల సమ్మేళనాలు ఉంటే, ఒక కప్పు బ్లాక్ కాఫీలో 1000కి పైగా ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి." ఇది అల్జీమర్స్ వంటి భయంకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

మునగ గింజల పవర్ చూశారా?
మునగ గింజల పవర్ చూశారా?

పాలు, చక్కెరతోనే అసలు ముప్పు!

అయితే, కాఫీకి మనం పాలు, రెండు చెంచాల చక్కెరను చేర్చినప్పుడే అసలు సమస్య మొదలవుతోంది. ఇలా చేయడం వల్ల కాఫీలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను శరీరం గ్రహించకుండా పాలు అడ్డుకుంటాయి. అంతేకాకుండా, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ తీపి కాఫీని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల కాలేయ సమస్యలు రావడమే కాకుండా, రక్తంలో చక్కెర పెరగడం 'మొండి బొడ్డు కొవ్వు' (Stubborn Belly Fat) పేరుకుపోయే ప్రమాదం ఉంది.

Coffee లవర్స్ కు గుడ్ న్యూస్. కప్పున్నర కాఫీ లివర్ కు బూస్ట్
Coffee లవర్స్ కు గుడ్ న్యూస్. కప్పున్నర కాఫీ లివర్ కు బూస్ట్

డాక్టర్ వోరా ఇచ్చే 'కాఫీ మంత్రం' ఇదే!

మనం తాగే కాఫీ మనకు మందులా పనిచేయాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు.

  • నో షుగర్ - నో మిల్క్: గరిష్ట ప్రయోజనాల కోసం కాఫీని ఎప్పుడూ 'బ్లాక్ కాఫీ' రూపంలోనే తీసుకోవాలి.
  • 90 నిమిషాల గ్యాప్: నిద్రలేవగానే వెంటనే కాఫీ తాగకూడదు. శరీరం సహజంగా ఉత్తేజితం అవ్వడానికి కనీసం 90 నిమిషాల సమయం ఇచ్చి, ఆ తర్వాతే మొదటి కప్పు తాగాలి.
  • 3 గంటల డెడ్‌లైన్: మంచి నిద్ర కావాలనుకునే వారు సాయంత్రం 3 గంటల తర్వాత కాఫీ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

"ఇది కేవలం బ్లాక్ కాఫీకి, సాధారణ కాఫీకి మధ్య ఉన్న తేడా కాదు.. మీరు ఉదయాన్నే తాగేది మీ శరీరానికి మేలు చేసే మందా లేక హాని చేసే అలవాటా అనేది ముఖ్యం" అని డాక్టర్ వోరా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రేపటి నుంచి మీ కాఫీ కప్పులో మార్పులు చేస్తారు కదూ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+