యాలకులతో హైబీపీకి చెక్.. ఇలా ట్రై చేయండి..!
భారతీయ వంటకాలలో యాలకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి తేలికపాటి, తాజా సువాసన కలిగి ఉంటాయి. వంటకాలతో పాటు స్వీట్స్, టీ, కేక్, ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాయి. దేశీ వంటకాల్లో విరివిరిగా ఉపయోగించే వీటివల్ల రుచి పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారు చేసిన నూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో తెలింది.
రక్తపోటును నియంత్రించే గుణాలు : యాలకులలో అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలలో వెల్లడైంది. బీపీ లెవెల్స్‌ను సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఇవి సహాయపడతాయి. వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌తో పాటు ఇతర ఔషధ గుణాలు బీపీని అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో చక్కగా ఉపయోగపడుతాయి. శరీరంలో ఉండే అధిక సోడియం, పొటాషియంలను బయటకు పంపేందుకు ఇవి ఉపయోగపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి : యాలకులను భారతదేశంతో పాటు చైనా, ఇండోనేషియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో సహాయపడుతాయి. వీటిని తరచూ ఆహారంతో చేర్చుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలెర్జీలను తగ్గించడంలో సహాయపడుతాయి. తుమ్ములు, దురద, కళ్లు ఎర్రబడటం వంటి అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి.
శ్వాసకోస సమస్యలకు చెక్: తాజా శ్వాస కోసం మౌత్ ఫ్రెషనర్‌గా కూడా యాలకులను ఉపయోగిస్తారు. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. జలుబు, దద్దు, బ్రాంకైటీస్ వంటి శ్వాసకోస సమస్యలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి: యాలకులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న యాలకులను తరచూ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..












Click it and Unblock the Notifications