బ్లూ టీ.. గ్రీన్ టీ కన్నా బెస్ట్.. దీంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!

మనం నిజ జీవితంలో బ్లాక్ టీ గురించి, గ్రీన్ టీ గురించి విని ఉంటాం.. కానీ బ్లూ టీ గురించి విన్నారా.. బ్లూ టీ బటర్ ఫ్లై బఠాని ఫ్లవర్ అని పిలిచే బ్లూ క్లిటోరియా టెర్నెటా.. అదేనండి మనం నిత్యం చూసే శంకు పువ్వు తో తయారు చేసే టీనే బ్లూ టీ అంటారు. ఈ బ్లూ టీని ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఆరోగ్యానిచ్చే బ్లూ టీ
సహజంగా శంకు పుష్పం అనగానే దేవుడికి పూజ చేయడానికి ఉపయోగించే పువ్వు. శివుడికి, శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన పువ్వు అని చెబుతారు. అయితే ఈ పువ్వు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని ప్రతినిత్యం దీనిని టీగా చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యవంతులుగా మారుతామని చెబుతున్నారు. మరి ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Blue tea is better than green tea shankpushpi tea does wonders for health

బ్లూ టీ తయారీ ఇలా
నాలుగైదు శంకు పుష్పాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు నీళ్లల్లో శంకు పుష్పాలను వేసి స్టవ్ పైన పెట్టి గ్లాసు నీళ్లు అయ్యేవరకు శంఖపుష్పాల యొక్క రంగు ఆ నీళ్లలో దిగే వరకు మరిగించాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి అందులో కాస్త నిమ్మరసం, తేనే కలిపి టీలాగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

బ్లూ టీ ఆరోగ్యం విషయంలో చేస్తుంది అద్భుతాలు
ఎవరైతే క్రమం తప్పకుండా శంకు పుష్పంతో తయారు చేసిన బ్లూ టీని తాగుతారో వారికి నరాల సంబంధితమైన సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. కళ్ళ రక్తనాళాలను శుద్ధి చేసి కంటి ఆరోగ్యాన్ని శంకు పుష్పాలతో తయారుచేసిన టీ మెరుగుపరుస్తుంది. మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడి వృద్ధాప్యచాయలు త్వరగా రాకుండా చేస్తాయి.

బ్లూ టీతో బీపీ, షుగర్ కంట్రోల్
చర్మ ఛాయను, ఆకృతిని కూడా మెరుగుపరుస్తాయి. బ్లూ టీ మన జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. గట్ హెల్త్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది క్యాన్సర్ కారకమైనటువంటి కణాలతో పోరాటం చేసి క్యాన్సర్ కణాలు ఎదుగుదలను నిరోధిస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.

బరువు, ఒత్తిడి కంట్రోల్
తలనొప్పి, మైగ్రేన్ తదితర సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ కడుపులో మంట వంటి సమస్యలతో పోరాటం చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హై బీపీ ఉన్నవారికి ఇది దివ్య ఔషధం అని చెప్పాలి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. సహజసిద్ధమైన బ్లూ టీ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే గొప్ప లక్షణాలు కూడా బ్లూ టీ లో ఉన్నాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+