బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్..
గుడ్డు ఆరోగ్యానికి మంచిది. గుడ్డులో సంపూర్ణ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డుతో సులభంగా ఎలాంటి వంటలైనా చేసుకోవచ్చు. అయితే గుడ్డుతో ఎప్పుడూ ఒకే రకమైన వంటలు చేసుకుని బోర్ కొట్టిందా..? అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నారా..? బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఓసారి చూస్తే.. గుడ్లు 4, పచ్చిమిర్చి 3 లేదా 4, కొత్తిమీర తగినంత, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత తీసుకోవాలి. గుడ్లను ఉడకపెట్టి గుండ్రంగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నెలో గుడ్లను కొట్టి వేయాలి. అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర తురుము, అల్లం పేస్టు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడెక్కాక అందులో గుడ్ల మిశ్రమాన్ని పోయాలి. అలా లో ఫ్లేమ్ లో ఉంచి.. దానిపైన గుండ్రంగా కట్ చేసుకున్న ఎగ్స్ ను పెట్టాలి. వాటిపై లైట్ గా చాట్ మసాలా, కారం, ఉప్పు తగినంత వేయాలి. అలాగే లో ఫ్లేమ్ లో పెట్టుకుని 3 నుంచి 5 నిమిషాల వరకు ఉంచాలి. చివరిలో కట్ చేసుకున్న చీజ్ వేసుకుంటే సరి.. నోరూరించే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications