బోటీ కూరతో భీముడిలాంటి బలం.. అంతేనా ఈ బెనిఫిట్స్ కూడా!
బోటి కూర ఒక సాంప్రదాయ భారతీయ వంటకం. అయితే బోటి కూరలో ఫుల్ గా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. భీముడిలా బలాన్నిస్తాయి. మేక లేదా గొర్రె పేగులతో బోటి కూరను వండుతారు. ఈ బోటి కూరలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ కె, ఫైబర్ బోటి కూర లో ఉంటాయి.
బోటి కూరలో ఫుల్ పోషకాలు
బోటి కూర మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మటన్, మటన్ మరాగ్, మటన్ పాయ సూప్ వంటి వంటకాలు మాత్రమే కాకుండా బోటి కూరకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం భారతీయ సాంప్రదాయ వంటలలో ఉంటుంది. బోటి కూర మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బోటి కూర ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. దీనిలో ఉండే ప్రోటీన్ తో కండరాల వృద్ధి జరుగుతుంది.

బోటీ కూరతో చర్మం, జుట్టుకు ఆరోగ్యం
మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని, ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి బోటి కూర దోహదం చేస్తుంది. మనకు రోజువారి ప్రోటీన్ అందించటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బోటి కూర లో ఐరన్, జింక్ మరియు విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా అవ్వాలంటే ఐరన్ అవసరం.
బరువు తగ్గటానికి , డయాబెటిస్ బాధితులకు బెస్ట్
మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కోసం విటమిన్ బి12 అవసరం. రక్తం తక్కువగా ఉన్నవారికి, నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్నవారికి బోటి కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. బోటి కూరలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మన బరువును తగ్గించడానికి దోహదం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా బోటీ చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ఎముకలకు ధృడత్వం
బోటి లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. మన గట్ ఆరోగ్యానికి మద్దతు పలుకుతుంది. బోటి కూరలో కొల్లాజెన్ అధికంగా ఉండడం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది..అయితే బోటి కూరలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు దీనిని ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది.












Click it and Unblock the Notifications