క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. కప్ప కడుపులో అద్భుత ఔషధం!

క్యాన్సర్ మహమ్మారిని తుదముట్టించే దిశగా సైంటిస్టులు ఓ విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జపాన్ ట్రీ ఫ్రాగ్ అనే ఒక రకం కప్ప పేగుల్లో ఉండే బ్యాక్టీరియా క్యాన్సర్‌పై అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు.

ఎలా కనుగొన్నారంటే?
సాధారణంగా కప్పలు, బల్లులు వంటి జంతువులకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ విషయాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వాటి పేగుల్లో ఉండే బ్యాక్టీరియాకు ఏవైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా అని పరిశీలించారు. ఇందుకోసం కప్పలు, బల్లుల నుంచి సేకరించిన 45 రకాల బ్యాక్టీరియాలను ఎలుకలపై ప్రయోగించారు. వాటిలో 9 రకాలు క్యాన్సర్‌ను ఎదుర్కోగా.. జపాన్ కప్పలోని ఈవింగెల్లా అమెరికానా (Ewingella americana) అనే బ్యాక్టీరియా అద్భుత ఫలితాలను ఇచ్చింది.

Breakthrough Cancer Research Frog Gut Bacteria Shows Powerful Anti-Cancer Potential

ఈ బ్యాక్టీరియా ప్రత్యేకతలు ఏంటి?
పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఎలుకలకు కేవలం ఒక్క డోస్ ఈ బ్యాక్టీరియాను అందించగా.. వాటిలోని క్యాన్సర్ గడ్డలు (ట్యూమర్లు) పూర్తిగా కరిగిపోయాయి. చికిత్స తర్వాత 30 రోజులకు మళ్లీ క్యాన్సర్ కణాలను శరీరంలోకి పంపినా, ట్యూమర్లు మళ్ళీ ఏర్పడలేదు. అంటే ఇది శరీరంలో క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బ్యాక్టీరియా నేరుగా క్యాన్సర్ కణాలను చంపడమే కాకుండా శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను యాక్టివేట్ చేసి క్యాన్సర్‌పై దాడి చేయిస్తుంది. సాధారణ కీమోథెరపీ మందుల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం జరుగుతుంది. కానీ ఈ బ్యాక్టీరియా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆక్సిజన్ లేకపోయినా పనిచేస్తుంది..
సాధారణంగా క్యాన్సర్ గడ్డలు ఉండే చోట ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కీమోథెరపీ మందులు అక్కడ సరిగ్గా పని చేయవు కానీ, ఈ బ్యాక్టీరియా ఆక్సిజన్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా సమర్థవంతంగా క్యాన్సర్ కణాలను అంతం చేయగలదు.

ఇంకా ప్రయోగాలు జరగాలి
ప్రస్తుతానికి ఈ పరిశోధన కేవలం ఎలుకలపై మాత్రమే జరిగింది. ఇది మనుషులపై ఎలా పనిచేస్తుంది? దీనివల్ల మనుషులకు ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాలపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. 'గట్ మైక్రోబ్స్' అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ప్రకృతిలోని జీవవైవిధ్యంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, వాటిని కాపాడుకుంటే మరిన్ని ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+