వంకాయ కూరలో ఇలా పాలు పోసి వండితే .. ఇక స్వర్గమే !

కూరగాయల రాజు వంకాయకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తెలుగు వారి వంటింట్లో వంకాయకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. "వంకాయ వంటి కూర.. వావి వరుసల వంటి చుట్టం లేదు" అనే సామెతే దీనికి నిదర్శనం. రోజువారీ భోజనంలోనూ, పండుగ వంటల్లోనూ వంకాయ లేకుండా భోజనం పూర్తైనట్లు అనిపించదు. చిన్న గుండ్రటి వంకాయల నుంచి పొడుగు వంకాయల వరకు, ముదురు ఊదా రంగు నుంచి తెల్లని వంకాయల వరకు ప్రతి రకం వేర్వేరు రుచిని, వంటలో వేర్వేరు ప్రత్యేకతను అందిస్తుంది.

కాగా పోషక విలువలు రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా వంకాయలో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, ఫైబర్ (పీచు పదార్థం) సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు లేదా ఎలర్జీ ఉన్నవారు వంకాయను తక్కువగా తీసుకోవడం మంచిది. కేవలం కూరగానే కాకుండా వంకాయతో చేసే పచ్చడి (వంకాయ బజ్జి), వేపుడు మరియు సాంబారులో వేసే వంకాయ ముక్కలు భోజనానికి అదనపు రుచిని అందిస్తాయి.

brinjal-milk-curry-making-recipe-in-telugu-with-easy-steps-and-serving-details-for-good-taste-and-he

ఏ మసాలాతోనైనా ఇట్టే కలిసిపోయి, అద్భుతమైన రుచిని ఇవ్వడం దీని ప్రత్యేకత. అయితే వంకాయ పాలు కూర (Brinjal Milk Curry) అనేది ఒక సులభమైన, రుచికరమైన ఆంధ్రా తరహా వంటకం. ఇది కమ్మని రుచిని కలిగి ఉంటుంది, ముఖ్యంగా మసాలాలు లేకుండా పాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో వండుతారు. ఈ కూర తయారీ ఎలానో మీకోసం ప్రత్యేకంగా..

(Brinjal Milk Curry) కావలసిన పదార్థాలు:

వంకాయలు - 1/4 కిలో (ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో ఉంచాలి)

పాలు - 1 కప్పు (కాచి చల్లార్చినవి)

పచ్చిమిర్చి - 3-4 (నడుమ చీలికలు)

పోపు దినుసులు -

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర - 1 టీస్పూన్

మినప్పప్పు - 1 టీస్పూన్

శనగపప్పు - 1 టీస్పూన్

ఎండుమిర్చి - 2

కరివేపాకు - రెండు రెమ్మలు

పసుపు - చిటికెడు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - 2 టేబుల్ స్పూన్లు

(Brinjal Milk Curry)తయారీ విధానం:

ముందుగా స్టవ్‌పై బాండీ పెట్టి నూనె వేయాలి.

నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేయాలి.

పోపు వేగాక పచ్చిమిర్చి చీలికలు, వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.

చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సన్నని మంటపై వంకాయ మెత్తబడే వరకు ఉడికించాలి.

వంకాయ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి (సిమ్‌లో ఉంచి) పాలను మెల్లగా పోయాలి.

పాలు కూరలో కలిసేలా తేలికగా కలిపి, దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి.

ముఖ్యమైన చిట్కా:

పాలు పోసేటప్పుడు మంట ఎక్కువగా ఉంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంట తగ్గించిన తర్వాత మాత్రమే పాలు పోయాలి. కావాలంటే చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చు.

ఎలా వడ్డించాలి?

ఈ వంకాయ పాలు కూర వేడి అన్నంతో, నెయ్యి వేసిన అన్నంతో, చపాతీ లేదా రొట్టెలతో అత్యంత రుచిగా ఉంటుంది. మసాలాలు లేకపోయినా, నోట్లో కమ్మగా నిలిచే రుచి దీని ప్రత్యేకత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+