లైంగిక జీవితం మెరుగుపడేందుకు ఈ ఒక్క పండు తీసుకోండి
రోజురోజుకు మన జీవనశైలి మారుతూ వస్తోంది. దీంతోపాటు ఆహార విధానం కూడా మారుతోంది. ఈ రెండూ మనిషి లైంగిక జీవితం మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది ఆరోగ్యవంతంగా ఉండాలంటే సూపర్ ఫ్రూట్ గా చెప్పుకునే బ్రోకలీని తీసుకోవాలి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. లైంగిక ప్రేరేపణకు, పనితీరుకు రక్త ప్రవాహం సరిగా ఉండాలి. ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ సమ్మేళనం స్త్రీలు, పురుషుల్లో లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.
విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
ఆహారంలో బ్రోకలీని తీసుకుంటే లైంగిక జీవితం మెరుగుపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటాయి. పోషకాలకు శక్తిలాంటిది. బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఇన్ఫెక్షన్లను నివారించడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ సహాయం చేస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోతుంది. విటమిన్ కే, కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రోకలీని తీసుకోవడంవల్ల ఎముక పగుళ్లను నివారించడంతోపాటు బోలు ఎములక వ్యాధిని తగ్గించవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు కణాలను దెబ్బతినకుండా చూస్తాయి. ఇన్నిరకాలుగా ఆరోగ్యాన్ని రక్షిస్తున్న బ్రోకలీని కచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్య నిపుణులతోపాటు, పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ తినడం మానేయాలని, అలాగే కూర్చొని పనిచేసే విధానాన్ని మార్చుకోవడంతోపాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా అరగంట నుంచి 45 నిముషాల వరకు వ్యాయామం ఉండాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications