తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా..
తెలంగాణలో సల్లచారు అంటే తెలియని వారు ఉండరు. మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ వంటకాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మజ్జిగ పులుసును పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అయితే ఈ సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు..? తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి..
సూపర్ టేస్టీ 'సల్లచారు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెరుగు తగినంత, ఉప్పు, అల్లం,పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పసుపు తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగును కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగులో రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి.

ఇప్పుడు అల్లం ముక్కలను, పచ్చిమిర్చీ ముక్కలను, కరివేపాకును వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగును తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పసుపు వేసి ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి అల్లం పేస్టును వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకుని మజ్జిగ చారును అందులో వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. సూపర్ టేస్టీ సల్ల చారు రెడీ అయినట్టే..
-
టర్కీ కోడి కూర.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications