ఈ ఆకుల రసం తాగండి... జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు

ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ల నొప్పులు. జీవన శైలి మారడం, ఆహారపు అలవాట్లు మారిపోవడం, పోషకాహార లోపం, అధిక శారీరక శ్రమ.. తదితరాలు మోకాళ్ల నొప్పులకు కారణమవుతున్నాయి. ఆర్థరైటిస్ ఉండటం, గోళ్ల వాపు, కండరాల నొప్పులు, ఎముకల సమస్యలు, అధిక బరువు లాంటివి మోకాళ్ల నొప్పులు రావడానికి కారణమవుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆకుల రసాలు వీటిని తగ్గిస్తాయి. మోకాళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

ఆకు కూరల్లో కావల్సినంత కాల్షియం
అన్నిరకాల ఆకు కూరల్లో కాల్షియం కావల్సినంత ఉంటుంది. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది. జ్యూస్ రూపంలో లేదంటే కూర రూపంలో తీసుకోవాలి. దీనిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలోపేతమై మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. మెంతికూరను కూడా పాలకూరలా జ్యూస్ రూపంలో లేదంటే సూప్ లా తీసుకుంటే మంచిది. దీన్నుంచి భారీగా కాల్షియం లభిస్తుంది. చుక్క కూరను మన ఆహారంలో ప్రతిరోజు భాగంగా చేసుకోవాలి. దీన్నుంచి అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది. బచ్చలికూర, తోటకూర, గంగవావిలి కూర, పొన్నగంటి కూరల్లో కూడా కాల్షియం ఉంటుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం చాలా మంచిది. మోకాళ్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి.

Calcium present in leafy vegetables can reduce knee pain

తులసి: తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మోకాళ్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
కరివేపాకు: కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
అల్లం: అల్లంలో ఉండే జింజెరోల్ అనే పదార్థం మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
వేప: వేప ఆకుల రసం మోకాళ్ల నొప్పులతో పాటు, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

తగిన వ్యాయామాలు చేయడంవల్ల మోకాళ్ల బలం పెరుగుతుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడంతోపాటు మోకాళ్లకు విశ్రాంతినివ్వాలి. వేడినీటితో స్నానం చేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మసాజ్ చేయించుకోవడంవల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+