కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జీడిపప్పు తినొచ్చా?
జీడిపప్పు మనకు ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ ఈ, విటమిన్ b6, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితోపాటు జీడిపప్పులో క్యాలరీలు, కొవ్వులు కూడా ఉంటాయి. జీడిపప్పును చాలా మంచి పోషకాహారంగా చెబుతారు. అయితే అటువంటి జీడిపప్పు అందరూ తినొచ్చా.. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు జీడిపప్పును తినొచ్చా? తినకూడదా? అనేది ప్రతిఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే
జీడిపప్పును కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మితంగా తినొచ్చు. ఎందుకంటే జీడిపప్పు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం వంటి పోషకాలు హైబీపీ ని తగ్గించడంతోపాటు, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచడమే కాకుండా రక్తపోటును కూడా జీడిపప్పు తగ్గిస్తుంది.

జీడిపప్పు ఎక్కువ తింటే జరిగేదిదే
జీడిపప్పులో ఉండే మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి దోహదం చేస్తుంది. అయితే జీడిపప్పును అతిగా తింటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీడిపప్పును ఎక్కువగా తినే వారిలో కడుపుబ్బరం, బరువు పెరగడం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది .కనుక, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు జీడిపప్పును మితంగా తీసుకుంటే మంచిది .
జీడిపప్పులో పోషకాలు.. ఈ ప్రయోజనాలు
కొద్ది మొత్తంలో జీడిపప్పును చేసుకోవడం వల్ల జీడిపప్పులో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. జీడిపప్పు మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. జీడిపప్పుతో ఎముకలకు బలం చేకూరుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాల, నరాల పనితీరు మెరుగుపడుతుంది.
ఎక్కువ మొత్తంలో జీడిపప్పు తినటంతో ఆరోగ్య నష్టం
అలాకాకుండా క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండే జీడిపప్పును ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తుంది. కనుక జీడిపప్పు తినే విషయంలో జాగ్రత్త. మితంగా జీడిపప్పు తింటే పర్వాలేదు కానీ అతిగా జీడిపప్పు తింటే అనర్ధాలే. అందుకే జాగ్రత్త!












Click it and Unblock the Notifications