బ్రేకప్ తర్వాత ఎక్స్‌తో స్నేహం సాధ్యమేనా? ఈ 4 నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. కానీ మనస్పర్థలు వచ్చి విడిపోయినప్పుడు ఆ జ్ఞాపకాలను మర్చిపోవడం అంత సులభం కాదు. విడిపోయిన తర్వాత కూడా కొందరు తమ మాజీ ప్రేమికుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారితో కనీసం స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది ఎంతవరకు శ్రేయస్కరం? అయితే బ్రేకప్ తర్వాత మళ్లీ స్నేహం చేయాలనుకునే వారు కొన్ని విషయాలను తప్పక గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అది పూర్తిగా అవతలి వ్యక్తి అభిప్రాయంపై కూడా ఆధారపడి ఉంటుందని వారు గుర్తు చేశారు. మాజీ ప్రేమికులతో స్నేహం చేసే ముందు 4 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు.
స్నేహం చేసే ముందు ఆలోచించాల్సిన 4 ముఖ్యమైన విషయాలు:
1. మీరు నిజంగానే మూవ్ ఆన్ అయ్యారా?
మీరు మీ మాజీ ప్రేమికులతో స్నేహం చేయాలనుకునే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు వారిని పూర్తిగా మర్చిపోయి.. ఆ పాత ఎమోషన్స్ నుంచి బయటపడ్డారా? వారి వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న విషయాలు (ఉదాహరణకు వారు వేరొకరితో డేటింగ్ చేయడం) తెలిస్తే మీరు తట్టుకోగలరా? ఒకవేళ వారి గురించి విన్నప్పుడు మీకు బాధ కలిగితే, స్నేహానికి దూరంగా ఉండటమే మంచిది.

2. మీ ఉద్దేశం స్పష్టంగా ఉందా?
కొందరు బ్రేకప్ తర్వాత స్నేహం పేరుతో మళ్లీ దగ్గరవ్వాలని లేదా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఇలాంటి దాగి ఉన్న ఉద్దేశాలుఉంటే అది భవిష్యత్తులో మీకు మరింత నొప్పిని కలిగిస్తుంది. కేవలం స్నేహం మాత్రమే కావాలనుకుంటేనే ముందుకు వెళ్లండి.
3. మీ కొత్త రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందా?
మీరు మీ ఎక్స్‌తో స్నేహం చేయడం వల్ల మీ ప్రస్తుత భాగస్వామికి ఇబ్బంది కలగవచ్చు. ఇది మీ కొత్త బంధంలో అపార్థాలకు దారితీస్తుంది. ఈ స్నేహం మీ ప్రస్తుత రిలేషన్‌షిప్‌ను పాడుచేస్తుందని అనిపిస్తే గతాన్ని గతంలోనే వదిలేయడం ఉత్తమం.
4. సరిహద్దులు ఉన్నాయా?
స్నేహం అన్న తర్వాత కొన్ని పరిమితులు ఉండాలి. ఎంత తరచుగా మెసేజ్ చేయాలి? ఎంతసేపు కాల్‌లో మాట్లాడాలి? వ్యక్తిగత విషయాలు ఎంతవరకు పంచుకోవాలి? అనే విషయాల్లో స్పష్టమైన సరిహద్దులు గీసుకోవాలి. లేదంటే ఆ స్నేహం మళ్లీ మిమ్మల్ని పాత జ్ఞాపకాల్లోకి నెట్టి, మానసికంగా బలహీనపడేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications