డైటింగ్ చెయ్యకుండా బరువు తగ్గొచ్చా?

ఊబకాయం సమాజంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య. అధిక బరువుతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు జిమ్ కి వెళ్లే వాళ్ళు, విపరీతమైన డైటింగులు చేసేవాళ్లు, తక్కువ కాలంలో ఎక్కువ బరువు తగ్గాలని అదేపనిగా ఫోకస్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు.

డైటింగ్ లేకుండా కూడా బరువును ఈజీగా తగ్గవచ్చు
కొందరు బరువు తగ్గడం కోసం భోజనం మానేసి రకరకాల డైటింగ్ పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు డైటింగ్ ఒకటి చేస్తే సరిపోదు. డైటింగ్ లేకుండా కూడా బరువును ఈజీగా తగ్గవచ్చు. అయితే దానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

Can you lose weight without dieting

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి
బరువు తగ్గాలని భావించేవారు డైటింగ్ చేయక పోయినప్పటికీ కొన్ని పద్ధతులను పాటిస్తే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే డైటింగ్ చేయకున్నా పర్వాలేదు కానీ ఆహార నియమాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే పానీయాలు తాగకూడదు. టీ, కాఫీల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

ఇవి చేస్తే కూడా ఈజీగా బరువు తగ్గుతారు
కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వాకింగ్ చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. పని లేకుండా అధిక బరువు నుంచి విముక్తి పొందాలంటే పూర్తిగా ఆహారాన్ని మానేయాల్సిన అవసరం లేదు. మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రమ పద్ధతిలో కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శారీరక వ్యాయామం చేయడం, క్రమ పద్ధతిలో ఎక్సర్సైజులు చేయడం, యోగా వంటివి చేయడం చేయాలి.వర్షాకాలంలో

క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే ఊబకాయానికి చెక్
మంచి జీవనశైలి ని అలవర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం వంటి మంచి అలవాట్లను నేర్చుకోవాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఒక మంచి క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వలన ఊబకాయం సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+