ఏలకులు తింటున్నారా? టీ తాగుతున్నారా?

ఏలకులలో సుగంధ ద్రవ్యాలు ఉండటంవల్ల ఆహారానికి రుచి వస్తుంది. పలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. ఊబకాయంతో బాధపడేవారు రాత్రివేళ రువెచ్చని నీళ్లతో కలిపి వీటిని సేవించడంవల్ల బరువు తగ్గుతారు. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు నుంచి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు.

కిడ్నీలోని మలినాలను బయటకు పంపుతాయి. చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా ఏలకులు సహాయపడతాయి. జుట్టు రాలిపోతుందని రోజూ బాధపడేవారు ఏలకులను తీసుకోవాలి. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుంది. నోరు వాసన వస్తుంటే ఏలకులు నమిలితే మంచి ఫ్రెష్ నర్ గా పనిచేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఏలకులు తినాలి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. అలాగే కాలేయ వ్యాధిని నివారించడంలో కూడా వీటిపాత్ర ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.

cardamomhealth benefits and uses

నరాల బలహీనత, లైంగిక నపుంసకత్వంతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఏలకులను కచ్చితంగా ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. యాలకుల టీ తాగినా మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల నుంచి దూరం కావాలంటే ఏలకుల టీ తీసుకోవాలి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. కడుపులో మంట, నొప్పి తగ్గుతాయి. ప్రతిరోజు ఏలకులుతీసుకోవడంవల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. గుండెకు సంబంధించిన సమస్యలు దగ్గరకు రావని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+