ఎముకలు దృఢంగా మారాలంటే ఇవి గుప్పెడు తీసుకోండి
పుట్నాల పప్పు లేదంటే వేయించిన శనగపప్పు గురించి అందరికీ తెలుసు. వీటిని వేపుళ్లు, పచ్చళ్లలో వాడతారు. వీటిని తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు వీటిని ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
వీటిల్లో వృక్ష సంబంధిత ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసేవారు వీటిని తీసుకోవడంవల్ల శరీరానికి సరిపడా ప్రొటీన్ వస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఇది చురుకుగా ఉంచుతుంది. దీనివల్ల అజీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్నాల పప్పు మనకు ఎంతో తోడ్పడుతుంది.

పుట్నాల పప్పును తీసుకోవడంవల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇతర ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేం. దీనివల్ల బరువు తగ్గుతాం. అలాగే ఈ పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలున్నాయి. వీటిని తీసుకుంటే ఎముకలు ధృఢంగా మారతాయి. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకలకు సంబంధిత సమస్యలు మనదరికి చేరవు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగరు ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా పుట్నాలపప్పును తీసుకోవడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.












Click it and Unblock the Notifications