బరువు తగ్గటం కోసం చీట్ కోడ్స్.. మీరూ ట్రై చెయ్యండి!
చాలామంది బరువు తగ్గాలని శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు అయితే ఫిట్నెస్ కోచ్ లు వ్యాయామంతో పాటు బరువు తగ్గడం కోసం ఏం చేయాలి అనేది వివరించి చెప్తున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు వెయిట్ లాస్ చీట్ కోడ్స్ తప్పక తెలుసుకోవాలని చెబుతున్నారు ఇక వాటి వివరాల్లోకి వెళితే..
ఇలా చేస్తే వెయిట్ లాస్ జర్నీ సులువు
ఆకలిగా అనిపించినప్పుడు దొరికిందల్లా తినేయకుండా ఉండాలి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మన శరీరంలోని కొవ్వులను శక్తి కోసం అది వినియోగించుకుంటుంది. కాబట్టి ఆకలి వేసిన వెంటనే తినకుండా ఉంటేనే మంచిది. ఇక తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 80% పోషకాలు ఉండే ఆహారాన్ని మిగతా 20 శాతం ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు.

ఆహారం తగ్గించాలంటే ఈ పని చెయ్యండి
ఇక భోజనానికి, టిఫిన్ కి ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగాలి. దీని కారణంగా మనం తీసుకునే ఆహారం కొంత మేరకైనా తగ్గుతుంది. మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటాం. అంతేకాదు భోజనం చేసిన తర్వాత కాస్త దూరం ఖచ్చితంగా నడవాలి. అలా నడిస్తే జీర్ణ సంబంధితమైన సమస్యలు రాకుండా ఉంటాయి.
నిద్ర లేకున్నా ఒబేసిటీ
ఇక నిద్రకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటలు ముందే భోజనాన్ని ముగించాలి. దీనివలన శరీరంలో కొవ్వు పేరుకుపోదు. నిద్రకు ముందే ఆహారం జీర్ణమై బరువు తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. ఇక ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేదాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది..
బరువు తగ్గాలంటే ఇది కంపల్సరీ
ఇక నిద్రలేమి సమస్య శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. మోతాదుకు మించి ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి 7 నుంచి 8 గంటల పాటు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిద్రపోవాలి. ఎవరికైతే సరైన నిద్ర ఉంటుందో వారికి అది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
ఇవి పాటిస్తే బరువు తగ్గటం సులువే
ఎక్కువ ఒత్తిడికి గురైతే కార్టిసాల్ హార్మోన్ విడుదల అవుతుంది. దీని వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యో,గా మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ఇక వీటిని పాటిస్తే వెయిట్ లాస్ జర్నీ ఈజీగా ఉంటుంది. బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది .
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications