Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఆహారాలతో HMPV వైరస్ కు చెక్!

చైనాలో వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎం పివి వైరస్ ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు కేసులు దాకా నమోదయ్యాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని మర్చిపోలేకపోతున్న ప్రజలు ఈ కొత్త చైనా వైరస్ పైన తెగ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శ్వాస కోసం పైన ప్రభావాన్ని చూపించే ఈ వైరస్ గురించి ఆందోళన పడుతున్నారు.

హెచ్ఎం పివి వైరస్ ప్రభావం వీరిపైనే
ఇది ముఖ్యంగా బలహీనంగా ఉన్న వారికి, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారికి, చిన్నారులకు, వృద్ధులకు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో తమని తాము ఏ విధంగా కాపాడుకోవాలి అన్నదానిపైన ప్రతి ఒక్కరు తర్జనభజన పడుతున్నారు.

Check for HMPV virus with these foods

హెచ్ఎంపివి వైరస్ కు చెక్ పెట్టే ఆహారాలు
బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావాన్ని చూపించదని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు ఏమిటి? ఏ ఆహారాలు తీసుకుంటే హెచ్ ఎం పీవీ వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాము అనేది ప్రతి ఒక్కరు ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాలు తినండి
హెచ్ఎంపీవీ వైరస్ నుండి కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచే సిట్రస్ ఫలాలను తీసుకోవాలి. ముఖ్యంగా నారింజ, ద్రాక్ష, బత్తాయి, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. ఇక పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరలు, దోసకాయలు వంటి కూరగాయలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేస్తాయి.

వీటితోనూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఇక హెచ్ఎంపీవీ వైరస్ నుండి కాపాడుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వెల్లుల్లి తీసుకుంటే మంచిది. వెల్లుల్లిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి, రోగాల బారి నుండి వెల్లుల్లి కాపాడుతుంది. ఇది ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. పెరుగులో ప్రోబయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లంతో పాటు నట్స్, సీడ్స్ కూడా
హెచ్ఎంపీవీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అల్లం మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అల్లం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడానికి దోహదం చేసి వైరస్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఇక బాదంపప్పు, వాల్ నట్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా వైరస్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది. అంతే కాదు తేనె కూడా మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ నుంచి విముక్తి పొందాలనుకుంటే ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+