వెల్లుల్లితో పాటు సహజసిద్ధమైన వీటితో హై బీపీకి చెక్!
అధిక రక్తపోటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైబీపీ ఒక సాధారణమైన ఆరోగ్య సమస్యగా అత్యంత ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తూ ఉంది. ఏ ఇంట్లో చూసినా బీపీ పేషెంట్ ఒక్కరైనా ఉంటున్న పరిస్థితి ఉంది. బీపీకి చికిత్స తీసుకోకపోతే అది తీవ్రమైన సమస్యగా మారుతుంది .ఈ ఐదు మూలికలు అధిక రక్తపోటును సహజసిద్ధంగా తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
తులసి
తులసిలో బీపీని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి రక్తపోటును నివారించడానికి సహాయపడతాయి. రక్తనాళాలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి తులసి టీ తాగడం లేదా తులసి ఆకులను నమలడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చర్య మన బీపీని తగ్గిస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లి కూడా హైబీపీని తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి రక్త పోటు స్థాయిలను వెల్లుల్లి నియంత్రిస్తుంది.
ఉసిరి
ఉసిరిలో మన శరీరానికి, చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉసిరిలోని విటమిన్ సి గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త పోటును తగ్గించడంలో ఉసిరి ఎంతగానో దోహదం చేస్తుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో రక్తనాళాల పనితీరును మెరుగుపరిచే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇది సిస్టోలిక్, డయస్టోలిక్ రక్తపోటు రెండింటిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది డయాబెటిస్ ఉన్నవారికి కూడా దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది.
అశ్వగంధ
అశ్వగంధలో కూడా అధిక రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఇది శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచడంలో రక్తపోటును నార్మల్ కు తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications