బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఇవి తాగండి

చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ఇవి పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికమ్ నుంచి వస్తాయి. ముదురు నలుపు రంగులో ఉండే ఈ విత్తనాల్లో ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చాలామంది చియా విత్తనాలను తమ రోజువారీ ఆహారంలో భాగంగా వాడుతుంటారు.

సలాడ్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లలో అధికంగా వీటిని వాడతారు. చియా గింజల నుంచి ప్రయోజనాలను పొందాలనుకుంటే.. చియా సీడ్ నీటిని తాగాలి. ఈ నీటిని తాగితే శరీర బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వీటిల్లో ఉండే ప్రొటీన్లు చాలా సమయంపాటు కడుపును నిండుగా ఉంచుతాయి. ఎక్కువ ఆకలి కాకుండా చేస్తుంది. శరీరంలో జీవక్రియను అద్భుతంగా పెంచుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

chia seed water health benefits and uses in telugu

చియా గింజల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగు, జీర్ణవ్యవస్థను నిర్వహించడంలో చియా గింజల పాత్ర వెలకట్టలేనిది. ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరానికి శక్తి అందుతుంది. ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో కూడా తోడ్పడుతుంది. ఖనిజాలు, విటమిన్లు కూడా చియా విత్తనాలలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇనుము, కాల్షియం, విటమిన్ బి, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఫోలేట్ అధికంగా ఉంటాయి.

చియా విత్తనాలను తినాలంటే సులభమైన మార్గం ఒకటి ఉంది. ఒక గ్లాసు చియా గింజల నీటిని తయారు చేయాలంటే ఒక టీస్పూన్ చియా గింజలను గ్లాసు నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత వీటిని వడబోసి తాగాలి. వీటి రుచి నచ్చకపోతే అందులో నారింజ రసం, నల్ల మిరియాలు, నిమ్మరసం, తేనె కలిసి తీసుకోవచ్చు. ఉదయం పూట తీసుకుంటే చాలా మంచిది. పరగడుపున తీసుకోవడంద్వారా సులువుగా బరువు తగ్గుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+