మోదుగు ఆకుల్లో చికెన్ ఫ్రై.. ఇలా చేస్తే నెక్స్ట్ లెవల్!
తెలంగాణలో పండుగలు, ప్రత్యేక సందర్భాలకు కచ్చితంగా వండేది మాంసాహారం, ఏ చిన్న ఫంక్షన్ అయినా ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, చేపలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మాంసాహారాన్ని వండి వడ్డిస్తారు. విందు భోజనాలు నలుగురికి నచ్చేలా, నలుగురు బాగున్నాయి అని చర్చించుకునేలా ఏర్పాటు చేయడం కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో కొనసాగుతున్న ఆనవాయితీ.
మోదుగు ఆకులలో చికెన్ ఫ్రై
అయితే ఇలా చేసే వంటకాలలో, మీరు మీ ఇంటికి వచ్చిన అతిధులను ఆకట్టుకునేలా పాతకాలంలో విందు భోజనాలలో వడ్డించే చికెన్ ఫ్రై మోదుగు ఆకులలో తయారు చేసి వడ్డిస్తే రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటుంది... అయితే మోదుగు ఆకులలో చికెన్ ఫ్రై ఎలా చెయ్యాలో చాలా మందికి తెలీదు. ఇప్పుడు మనం పాతకాలపు మోదుగాకులలో చికెన్ ఫ్రై వంట తెలుసుకుందాం.

పచ్చి మోదుగు ఆకుల్లో చికెన్ ఫ్రై చేసే పద్ధతి
మొదట ముక్కలు ముక్కలుగా చేసుకున్న కోడి మాంసానికి చిటికెడు పసుపు ,ఒక టేబుల్ స్పూన్ మెత్తటి ఉప్పు , కొద్దిగా తరిగిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ ముద్దను కోడి మాంసంలో కలిపి కూరకు సరిపడేంత కారం, కొద్దిగా ఆయిల్ ను పోసి వాటితో పాటు చిన్న చిన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరప కాయలను మాంసంలో కలపాలి.
మోదుగాకులలో చికెన్ తయారీకి ఇలా చెయ్యాలి
అన్ని కలిపిన కోడి మాంసాన్నీ పచ్చి మోదుగు ఆకుల్లో వేసి మాంసాన్ని ఆకులతో చుట్టి ఒక ముద్దగా చేసిన తరువాత మట్టితో మోదుగ ఆకులను ప్యాక్ చెయ్యాలి., మట్టిని తడిపి ముద్దగా చేసి ఆ తరువాత ముద్ద మట్టిని పచ్చి ఆకులతో చుట్టిన మాంసానికి చుట్టూ ప్యాక్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
నిప్పులలో కాల్చటం ఇలా
మట్టిని తవ్వి గుంటతీసి అందులో కొన్ని కట్టెలు వేసి అవి బాగ మండి నిప్పుల రూపంలో మారిన తరువాత, ఆ నిప్పుల్లో మోదుగుఆకుల్లో మట్టి ముద్దలో చుట్టిన కోడిని బొగ్గులపై పెట్టీ మట్టి ముద్ద గట్టిగా ఏర్పడే వరకు నిప్పులపై కాల్చాలి. ఒక ముప్పై నిమిషాలు అలాగే ముద్దని విడదీయకుండా వేడి చల్లారే వరకు ఆగాలి.
రుచితో పాటు, ఆరోగ్యాన్ని ఇచ్చే చికెన్ ఫ్రై
గట్టిగా మారిన మట్టిని తీసి మోదుగు ఆకులను ఓపెన్ చేస్తే మోదుగాకులలో వండిన చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇది రుచితో పాటు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇంకెందుకాలస్యం ఈ కొత్త వంటని మీరు కూడా రుచి చూడండి,












Click it and Unblock the Notifications