చల్లని నీరు vs వేడి నీరు.. స్నానానికి ఏది మేలో తెలుసా..?
పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకోవడం.. కాలకృత్యాల్లో భాగంగా స్నానం చేయడం చాలా మందికి అలవాటే. స్నానం చేయందే చాలామందికి ఏ పనీ మొదలు పెట్టరు. ఇలా ప్రతిరోజూ స్నానం చేసే వారు దేశంలో చాలా మందే ఉన్నారు. అయితే కొందరికి చల్లని నీటితో స్నానం చేయడం అలవాటు. మరికొందరికి వేడి నీటితో స్నానం చేయడం ఇష్టం. మరి ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది..? చల్లని నీరు, వేడి నీరు.. ఇందులో ఏది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది.
అయితే వేడి నీటితో స్నానం.. అలాగే చల్లని నీటితో స్నానంపై వైద్యులు ప్రయోజనాలు తెలియజేశారు. వేడినీరు స్నానం ప్రయోజనాలు చూస్తే.. కండరాల నొప్పి, ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే వేడి నీటి స్నానం చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే చల్లని నీరు స్నానం ప్రయోజనాలూ వైద్యులు వివరించారు. చన్నీటి స్నానం.. శరీరానికి తేజస్సు, ఉత్సాహం ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని గట్టిగా, రక్త ప్రవాహాన్ని చురుగ్గా ఉంచుతుందని వైద్యులు వివరించారు.
అలాగే చల్లటి నీటి స్నానం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఇది రక్త ప్రసరణను ప్రేరేపించడం ద్వారా శరీరానికి ఆక్సిజన్, పోషకాలను అందిస్తుందని వివరిస్తున్నారు.

ఇక వేడి నీటి స్నానం వల్ల కండరాలు.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. వేడి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచడానికి.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి.. జలుబు లక్షణాలను తగ్గించడానికి.. చర్మాన్ని శుభ్రపరచడానికి.. అంతేకాక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉదయం చల్లని నీరు.. రాత్రి వేడి నీరు స్నానం చేయడం ఉత్తమం అని ఇలా రెండింటినీ సమతుల్యం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications