కొబ్బరి పాల పెరుగు.. తింటూ ఆరోగ్యంగా తిరుగు!
చాలామంది డైరీ ప్రొడక్ట్స్ ను తీసుకోవడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. పాల పదార్థాల వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు. డైరీ ప్రొడక్ట్స్ తో వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటికి ప్రత్యామ్నాయంగా అనేక పదార్థాలను కనిపెట్టారు. ఇక అటువంటి వాటిలో కొబ్బరి పాలు, కొబ్బరి పెరుగు ముఖ్యమైనవి.
కొబ్బరి పెరుగుతో ప్రయోజనాలు
కొబ్బరి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి దాని నుండి తీసిన పాలను వేడి చేసి తోడుపెట్టిన పెరుగు కొబ్బరి పెరుగు. ఈ కొబ్బరి పెరుగులో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కొబ్బరి పెరుగు మన ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

కొబ్బరి పెరుగుతో ఈ అనారోగ్య సమస్యలు దూరం
ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ బి12 మరియు విటమిన్ డి యొక్క గొప్ప మూలాలు ఎముకలను బలోపేతం చేయడంతో పాటు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కొబ్బరి పెరుగు మన గట్ హెల్త్ ను కూడా బాగా పెంచుతుంది. కొబ్బరి పెరుగు గట్ లైనింగ్ ను బలోపేతం చేస్తుంది. కడుపులో పేగులలో మంటను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది.
కొబ్బరి పెరుగు తయారీ విధానం
కొబ్బరి పాల పెరుగును ఏ విధంగా తయారు చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటి వెనుక ఉన్న నలుపు భాగాన్ని తీసివేసి ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని గుజ్జు లాగా తయారుచేసి అందులో నీళ్ళు పోసి మళ్లీ గ్రైండ్ చేసి దానిని ఒక తెల్లని క్లాత్లో వేసి గట్టిగా పిండి పాలను తీయాలి.
కొబ్బరిపాలను వేడి చేసి పచ్చి మిర్చితో ఇలా చేస్తే పెరుగు
మళ్లీ ఆ కొబ్బరిని మిక్సీలో వేసి మరికొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసి మళ్లీ మరొకసారి గట్టిగా పిండి పాలను వేరు చేయాలి. ఈ విధంగా కొబ్బరిని మూడుసార్లు నీళ్ళు పోసి గ్రైండ్ చేసి తీసిన పాలను లో ఫ్లేమ్ మీద స్టౌ పైన పెట్టి నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న ఆ పాలలో ఒక పచ్చిమిరపకాయను పచ్చిమిరపకాయ తొడిమలను వేసి మూత పెట్టాలి.
కొబ్బరి పెరుగుతో గుండెకు రక్షణ
తెల్లవారేసరికి కొబ్బరి పాలు కాస్త పెరుగుగా తోడుకుంటుంది. ఈ పెరుగును మనం తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన గుండెని రక్షించడంతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications