రాత్రి ఒక పదినిముషాలు ఈ పని చెయ్యండి... మీ ఆరోగ్యం కాంతివంతం!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల పదార్థాలు, ఎన్నో రకాల నూనెలు మన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అటువంటి వాటిలో కొబ్బరి నూనె ఒకటి. కొబ్బరి నూనె మన జుట్టుకి పోషణ అందించడమే కాకుండా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక చలికాలంలో రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనె రాసి పడుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

కొబ్బరి నూనె పాదాలకు రాస్తే ఇలా ప్రయోజనాలు
రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే పాదాలు మృదువుగా మారడమే కాకుండా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె మన పాదాలు దుర్వాసన రాకుండా కాపాడతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి కొబ్బరి నూనె రాసుకుంటే రాకుండా ఉంటాయి.

Coconut oil massage to foot find the health benefits with coconut oil massaging

కొబ్బరి నూనెతో చర్మ ఆరోగ్యం, ఈ బెనిఫిట్స్ కూడా
దగ్గు, జలుబు, జ్వరం, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనె రాసి పడుకుంటే రిలీఫ్ పొందుతారు కొబ్బరినూనె మన చర్మానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మన చర్మం నివారింపును సొంతం చేసుకునేలాగా మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఒత్తిడి నుండి రిలాక్స్ చేసే నూనె
రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనెను మర్దన చేసుకోవడం వల్ల మనకు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. టెన్షన్ బాగా తగ్గుతుంది. చలికాలంలో నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెను పాదాలకు రాసుకుని పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పోతారు. ప్రతిరోజు రాత్రిపూట పాదాలకు కొబ్బరి నూనె రాస్తే మీ గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె గోర్లను ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది.

బీపీ, షుగర్ పేషెంట్ లకు బెస్ట్ మెడిసిన్
మధుమేహంతో బాధ పడే వారికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. హై బీపీ సమస్య ఉన్న వారికి కూడా కొబ్బరి నూనె చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొబ్బరి నూనెతో ఫుట్ మసాజ్ చేయటం వల్ల శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు పాదాలకు అప్లై చేసి చూడండి. ఆ తర్వాత రిజల్ట్ మీరే చెప్పండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+