మీల్ మేకర్ ఫ్రై.. ఇలా చేస్తే చికెన్, మటన్ ను మించిన టేస్ట్..
మీల్ మేకర్ ను చికెన్, మటన్ లతో పోల్చుతారు. ఎందుకంటే చికెన్, మటన్ లతో ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో పోషకాలు ఉంటాయి. అందుకే చాలామంది నాన్ వెజ్ కు ప్రత్యామ్నాయంగా మీల్ మేకర్ ను ఎంచుకుంటారు. అయితే మీల్ మేకర్ ను ఎప్పుడూ ఒకే విధంగా చేసుకుని బోర్ కొట్టిందా..? అయితే ఈ విధంగా మీల్ మేకర్ ఫ్రై చేస్తూ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నం, చపాతీలోకీ బాగుంటుంది. మరి సూపర్ టేస్టీ మీల్ మేకర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి..?
మీల్ మేకర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మీల్ మేకర్ 100 గ్రాములు, టమాటా ఒకటి, ఉల్లిపాయ తరుగు ఒకటి లేదా రెండు, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్ లు, పసుపు కొద్దిగా, కారం తగినంత, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, లవంగాలు ఐదు, యాలకులు మూడు, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ లు, జీడిపప్పు, సోంపు, జీలకర్ర ఒక స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
మీల్ మేకర్ ఫ్రై తయారీ విధానం చూస్తే.. ముందుగా మీల్ మేకర్స్ ను ఉప్పు నీటిలో కొద్ది సేపు వేడిచేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో నార్మల్ వాటర్ పోయాలి. ఇప్పుడు మీల్ మేకర్స్ ను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఎండుకొబ్బరి, జీడిపప్పు, సోంపు, జీలకర్ర వేసి వేపుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీలో టమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమంలో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మీల్ మేకర్స్ వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఉడుకుతున్న కర్రీలో ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మరికాసేపు ఉడకనివ్వాలి. ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేస్తే సరి. సూపర్ టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ అయినట్టే..
-
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!











Click it and Unblock the Notifications